పోలీసుల ముందే దారుణ హత్య

రంగారెడ్డి జిల్లా యాలాల మండలం బండమీదిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని పాతనేరస్తుడు బుగ్గప్పను కొందరు దుండగులు కొట్టి చంపారు. జంట హత్యకేసుకో నేరస్తుడైన బుగ్గప్పను బెయిల్ పై పోలీసులు ఓ విందుకు తీసుకువచ్చారు. తిరిగి తీసుకెళ్తుండగా ఘటన జరిగింది. పోలీసుల ఎదుటే ప్రత్యర్థులు బుగ్గప్పను చంపడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.