పోలీసుల సోదాల్లో టేకు కలప, మద్యం బాటిళ్లు స్వాధీనం

కొమురంభీం ఆసిఫాబాద్‌,జూన్‌26(జ‌నం సాక్షి): పోలీసపలు సెర్చ్‌లో టేకు కలపను, మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  జిల్లాలోని ఆసిఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల ఈదులవాడ గ్రామంలో టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది సోదాలు చేపట్టారు. ఎస్పీ కల్మేశ్వర్‌ సింగన్‌వార్‌ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ సీఐ అల్లం రాంబాబు ఆధ్వర్యంలో టీం సభ్యులు ప్రసాద్‌, వెంకటేశ్‌, సునీత తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్రమ టేకు నిల్వలు, మద్యం బాటిళ్లు, గుట్కాను గుర్తించి సీజ్‌ చేశారు. జోగుల సాయివంశీ కిరాణా దుకాణంలో రూ. 2,285 విలువగల మద్యం బాటిళ్లు, రూ. 1,025 విలువగల గుట్కా ప్యాకెట్లు, రూ. 50 వేల విలువ గల టేకు కలపను స్వాధీనం చేసుకున్నారు. అదే గ్రామంలోని మండల తిరుపతి ఇంట్లో రూ. 4 వేల విలువ గల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం పోలీసులు చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారి వివరాలను  ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా సీఐ రాంబాబు తెలిపారు.

తాజావార్తలు