పోలీస్‌ కస్టడీకి క్వారీ ఛైర్మన్‌ పార్థసారధి


చంచల్‌గూడ జైలు నుంచి నాంపల్లి సీసీఎస్‌కు తరలింపు
హైదరాబాద్‌,అగస్టు25(జనంసాక్షి): కార్వి స్టాక్‌ బ్రోకరింగ్‌ చైర్మన్‌ పార్థ సారధిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి నాంపల్లి సీసీఎస్‌ కార్యాలయానికి పోలీసులు తరలించారు. ఇవాళ, రేపు ఆయనను పోలీసులు విచారించనున్నారు. ఇండస్‌ ఇండ్‌ బ్యాంకును మోసం చేసిన కేసులో మరింత పురోగతి కోసం ఆయనను ప్రశ్నించనున్నారు. బ్యాంకు నుంచి దాదాపు రూ.130 కోట్ల రుణం తీసుకున్న పార్థసారథి ఆ మొత్తాన్ని చెల్లించకపోవడంతో బ్యాంకు ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు సీసీఎస్‌ పోలీసులు ఆయనను ఇటీవల అరెస్టు చేశారు. చంచల్‌గూడ జైలులో పార్థసారథి రిమాండ్‌ ఖైదీగా ఉండగా.. విచారణ కోసం రెండు రోజుల కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు ఆదేశించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఎక్కడకు మళ్లించారు?.. ముందస్తు ఎª`లాన్‌తోనే ఈ మోసాలకు పాల్పడ్డారా? అనే సమాచారాన్ని పోలీసులు వెలుగులోకి తేనున్నారు. ఈ కేసులో మనీ లాండరింగ్‌ కూడా జరిగినట్లు ఆరోపణలు రావడంతో సీసీఎస్‌లో నమోదైన కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు(ఈడీ)కి సీసీఎస్‌ పోలీసులు అందించనున్నారు.