పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొన్న లారీ
హైదరాబాద్,జూన్20(జనంసాక్షి): పెద్ద అంబర్‌పేట వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుకు సవిూపంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి పోలీస్ పెట్రోలింగ్ వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్, కానిస్టేబుల్ నాగేశ్వరరావు, ¬ంగార్డు శేఖర్ గాయపడ్డారు. వీరిని హుటాహుటిన ఎల్బీనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో పోలీసు వాహనం నుజ్జునుజ్జు అవ్వగా, లారీ ముందు చక్రాలు కొద్ది దూరంలో పడ్డాయి. స్పీడుగా వచ్చిన లారీ పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.