పోలీస్ ఆన్లైన్ వ్యాసరచన పోటీలో ప్రతి విద్యార్థి పాల్గొనాలి

లింగంపేట్ 22 అక్టోబర్ (జనంసాక్షి)
 పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆన్లైన్ వ్యాసరచన పోటీల్లో ప్రతి విద్యార్థి పాల్గొనాలని లింగంపేట్ ఎస్ఐ శంకర్ అన్నారు.ఆయన శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.మండలంలోని 5 వ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి పౌరుల పాత్ర పై వ్యాసరచనలో పాల్గొనాలని అన్నారు.డిగ్రీ తో పాటు ఇతర పై చదువులు చదివిన విద్యార్థులు సైబర్ నేరాలను నిరోధించడంలో పౌరులు,పోలీసుల పాత్ర పై వ్యాసరచన పోటీలో పాల్గొనాలని తెలిపారు.ఈ వ్యాస రచనలను తెలుగు,ఉర్దూ,ఇంగ్లీష్ లో రాయవచ్చని తెలిపారు.ఆన్లైన్లో మీ పేరు తరగతి ఇతర వివరాలను నమోదు చేయాలన్నారు. వ్యాసాన్ని పేర్కొన్న ప్రదేశంలో పదాలను పరిమితి మించకుండా సమర్పించ వచ్చాన్నారు.ఆన్లైన్ వ్యాసరచన పోటీకి ఈనెల 24 చివరి తేదీ అని పేర్కొన్నారు. జిల్లా,కమిషనర్ స్థాయిలో వ్యాస రచనలో గెలుపొందిన ఉత్తమ 3 వ్యాసాలకు పోలీస్ పై అధికారులు బహుమతులు ప్రధానం చేస్తారని తెలిపారు.