పోలీస్ బందోబస్తుతో మాధవి మృతదేహానికి దహన సంస్కారం
కోడేరు (జనం సాక్షి) జూలై 07 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో అనుమానాస్పదలో మృతి చెందిన మాధవి మృతదేహానికి మూడు రోజుల తర్వాత గురువారం పోలీసు బందోబస్తు మధ్య దహన సంస్కారం నిర్వహించారు. వివరాల్లోకి వెళితే రాజాపూర్ గ్రామంలో ఈనెల 5వ తేదీన అనుమానాస్పదలో మాధవి (35) మృతి చెందింది. మృతురాలు తల్లిదండ్రులు బంధువులు రాజాపూర్ గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని చూసుకొని మృతదేహంపై గాయాలు ఉండడంతో భర్తే కొట్టి చంపాడని ఒక రోజు మొత్తం ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో గ్రామంలో పోలీసులు బందోబస్తు నిర్వహించి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అదే రోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో మృతదేహాన్ని నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం చేయించి సొంత గ్రామానికి గురువారం రోజు తీసుకువచ్చారు. మాధవి మృతదేహాన్ని దహన సంస్కారానికి తీసుకుపోతుండగా గ్రామంలోని స్థానికులు మరియు వారి బంధువులు అడ్డుకున్నారు. గ్రామంలో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చివరికి పోలీసుల బందోబస్తు తో దాన సంస్కారం పూర్తి చేయించారు. మృతురాలి తల్లి కృష్ణమ్మ కోడేరు పోలీస్ స్టేషన్లో తమ కూతురు అనుమానాస్పద స్థితిలో చనిపోయిందని పూర్తిస్థాయిలో విచారణ చేసి న్యాయం చేయాలని దీనికి కారకులైన వారిని శిక్షించాలని ఫిర్యాదు చేసిందని కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. బందోబస్తుతో మాధవి మృతదేహానికి దహన సంస్కారం.