పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్…….
టేకుమట్ల.ఆగస్టు11(జనంసాక్షి) 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రంలో అధికారులు ప్రజాప్రతినిధులు గురువారం ఫ్రీడమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్బంగా మండలంలోని రామకృష్ణాపూర్ (టి) గ్రామ శివారు లో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం నుండి మండల కేంద్రంలోని నూతన పోలీస్ స్టేషన్ వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి,జడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి తో పాటు స్థానిక ఎస్ఐ తమాషా రెడ్డి తో పాటు వివిధ శాఖల అదికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతన పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 10రోజుల పాటు భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మండల ప్రజలు భాగస్వాములై విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పొలాల సరోత్తంరెడ్డి,ఎంపీటీసీ సభ్యుడు ఆది సునిత రఘు,వైస్ ఎంపీపీ పోతనవేణి ఐలయ్య,ఎంపీటీసీ సంగి రవి,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,అన్ని శాఖల అధికారులు, విద్యార్థులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.