పోలీస్ స్టేషన్లో నూతన రాష్ట్రపతి చిత్రపటం ఏర్పాటు
కొడకండ్ల,జులై (జనం సాక్షి)
భారత ప్రథమ పౌరురాలిగా దేశ 15వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గౌరవనీయులు పూజ్యులు గిరిజన ముద్దుబిడ్డ ద్రౌపది. ముర్ముగారికి శుభాభివందనాలు తెలుపుతూ జాతీయ పార్టీ పిలుపుమేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో భారత ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది.ముర్ము గారి చిత్రపటాన్ని స్థానిక కొడకండ్ల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సుంకరనేని కోటేశ్వర్ జిల్లా ఓ.బీ.సి. మోర్చా ప్రధాన కార్యదర్శి ముంజాల. శ్రీనివాస్ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రాయారపు. కన్నయ్య సీనియర్ నాయకులు కడారి. పద్మా రెడ్డి మండల ఉపాధ్యక్షులు చిట్టి మల్ల. రమేష్ కోట. బయన్న తదితరులు పాల్గొన్నారు.