పోస్ట్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నాయకుల నిరసన

రుద్రంగి జూలై 22 (జనం సాక్షి);
రుద్రంగి మండల కేంద్రంలో శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు  యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీపై ఈడి దాడులకు నిరసనగా స్థానిక పోస్ట్ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ…  స్థానిక రుద్రంగి మండల కేంద్రంలో గల సెంట్రల్  పోస్ట్ ఆఫీస్ వద్ద శ్రీమతి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి  సోనియా గాంధీ పట్ల,అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు    రాహుల్ గాంధీ పట్ల బిజెపి ప్రభుత్వం కొందరు అధికారులను అడ్డుపెట్టుకుని అధికారం ఉందని అహంకారంతో కడిగిన ముత్యం లాంటి కాంగ్రెస్ నాయకుల పట్ల సిబిఐ ఎంక్వైరీ పేరిట సోదాలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా బిజెపి పార్టీ ముందు ముందు ఎక్కడ బిజెపి పార్టీ వెనుకబడిపోతుందోనని గాంధీ కుటుంబం పట్ల అనుసరిస్తున్న తీరును ఎండగట్టుటకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసనను నల్ల బట్టలతో,నల్ల కండువాలతో నిరసనలు తెలిపామన్నారు. ఏఐసిసి మరియు పిసిసి పిలుపుమేరకు రుద్రంగి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు అందరు కలిసి నిరసన తెలుపడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమములో డీసీసీ కార్యదర్శి చెలుకల తిరుపతి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తర్రే మనోహర్,గడ్డం శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి,గండి నారాయణ, పిడుగు లచ్చి రెడ్డి,పల్లీ గంగాధర్,గుగ్గిళ్ళ వెంకటేష్, మాడిశెట్టి అభిలాష్,సూర యాదయ్య,గంధం మనోజ్,ఎర్రం గంగ నర్సయ్య,ఎర్రo రాజలింగం,ధర్నా మల్లేశం, అక్కేన పెళ్లి శ్రీనివాస్, వడ్లూరి పర్శయ,దయ్యాల నర్సన్న,ద్యవల్ల దీలిప్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area