పౌర అణు ఒప్పందానికి భారత్‌`అమెరికా కట్టుబడి ఉన్నాయి

జులైలో భారత్‌లో అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన
పలు కీలకాంశాలపై కెర్రీ, మన్మోహన్‌ భేటీ
న్యూఢల్లీి, జూన్‌ 24 (జనంసాక్షి) :
పౌర అణు ఒప్పందానికి భారత్‌`అమెరికా కట్టుబడి ఉన్నాయని ప్రధాని మన్మోహన్‌సింగ్‌, అమెరికా కార్యదర్శి జాన్‌కెర్రీ తెలిపారు. భారత్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన జాన్‌కెర్రీ సోమవారం మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. పలు కీలకాంశాలపై వీరి భేటీలో చర్చించనట్లు తెలిసింది. అంతకుముందు భారత విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్‌ఖుర్షీద్‌ కెర్రీ భేటీ అయి విదేశాంగ విధానాలు, హెచ్‌బీ 1 వీసాలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం కెర్రీ మీడియాతో మాట్లాడుతూ అమెరికా ప్రపంచశాంతిని కోరుకుంటోందని అందుకోసమే ఆరాటపడుతుందని అన్నారు. పౌర అణు ఒప్పందం అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఈ విషయమై చర్చించేందుకు తమ దేశ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌ జులైలో భారత్‌లో పర్యటిస్తారని తెలిపారు. అమెరికా గూఢచార కార్యకలాపాలపై విలేకరులు ప్రశ్నించగా తమ చర్యను ఆయన సమర్థించుకున్నారు. భారత్‌లో భారీ విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి తమ దేశం సహకరిస్తుందని పేర్కొన్నారు. గుజరాత్‌లో అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటులో అమెరికా సహకారాన్ని కోరనున్నట్లు ఖుర్షీద్‌ వెల్లడిరచారు. వాషింగ్టన్‌హౌస్‌ మెగా సివిల్‌ విద్యుత్‌ ప్రాజెక్టును శుద్ధతను 2016`17 నాటికి పూర్తి చేపేందుకు అమెరికా అంగీకరించిందని తెలిపారు.