పౌర స్పందన నేత శంకరన్‌ జీవిత విశేషాలపై వెబ్‌సైట్‌ ప్రారంభం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 14 (జనంసాక్షి) :
మాజీ ఐఏఎస్‌ అధికారి ఎస్‌. శంకరన్‌ జీవిత విశేషాలతో కూడిన వెబ్‌సైట్‌ను ఇవాళ హైదరాబాదులో ఆవిష్కరించారు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా శంకరన్‌ తీసుకున్న పలు ప్రజాప్రయోజన నిర్ణయాలను ఇందులో పొందు పరిచారు. 1987లో శంకరన్‌తో పాటు ఆరుగురు ఐఏఎస్‌ అధికారుల్ని నక్సలైట్లు కిడ్నాప్‌ చేసిన ఉదంతం, సాంఘిక సంక్షేమ శాఖ కార్య దర్శిగా ఆయన విద్యార్థులకు చేసిన మేలు తదితర అంశాలతో కూడిన ఈ వెబ్‌సైట్‌ను రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాద óవరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో విరసం నేత వరవరరావు ఐఏఎస్‌ అధికారులు  కె.ఆర్‌.వేణుగోపాల్‌, యుగంధర్‌, , ప్రొఫెసర్‌ హరగోపాల్‌, మల్లెపల్లి లక్ష్మయ్య తదితర ప్రముఖులు పాల్గొన్నారు.