పౌష్టికాహారంతోనే తల్లి బిడ్డ క్షేమం అంగన్వాడి కేంద్రంలో పోషణ మాంసం పై అవగాహన సదస్సు

 

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 19 (జనంసాక్షి) ఆత్మకూరు మండల పరిధిలోని పల్లెర్ల గ్రామంలో అంగన్వాడి కేంద్రం-1 లో పోషణ వారోత్సవాలను పురస్కరించుకొని పోషకాహార విలువలపై గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ అండాలు మాట్లాడుతూ పౌష్టికాహారంతోనే తల్లి బిడ్డ క్షేమంమని గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టిక ఆహారం పండ్లు ఆకుకూరలు కూరగాయలు పాలు గుడ్లు మాంసం చేపలు ఎక్కువగా తీసుకోవాలని తెలియజేశారు దాని వలన రక్తహీనత లేకుండా సుఖప్రసవము జరుగుతుందని అన్నారు అనంతరం పిల్లలకు అన్నప్రాసన అక్షరాభ్యాసం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ నాయిని అండాలు ఆశావర్కర్లు చంద్రకళ కవిత ఆయాలు గర్భిణీలు బాలింతలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు