“ప్రగతికి మరో అడుగు”

శిక్షణా తరగతులు.
మిర్యాలగూడ. జనం సాక్షి
మిర్యాలగూడ డిపో లో శుక్రవారం  చివరి శిక్షణా తరగతులు నిర్వహించారు. గతంలో పీక్ సీజన్ లో  డిసెంబర్ 2021 లో 8 తరగతులు నిర్వహించారు. ఇప్పుడు స్లాక్ సీజన్లలో అప్పడు తరగతులకు హాజర్ కానివారికి ఇప్పుడు ఈ నెలయందు 3 తరగతులందు మిగిలినవారికి శిక్షణ ఇచ్చి డి ఎం  బొల్లెద్దు పాల్ మాట్లాడుతూ .
ముఖ్యంగా ఈ శిక్షణా తరగతుల ముఖ్య ఉదేశ్యం:-మన డిపోలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగికి ,మన డిపోలో ఎన్నీ బస్ లున్నాయి,ఆర్టీసీ  బస్సు లెన్నీ,ప్రైవేట్ బస్సు లెన్నీ,ఏ ఏ రూట్లో తిరుగుతున్నాయి,రోజుకు ఎన్ని కిలోమీటర్లు , తిరుగుతున్నాయి,మనకు ఏరోజు ఎంత ఆదాయం ఒస్తుంది, రోజుకు ఎంత డీజిల్ ఖర్చు (వాడకం)అవుతుంది,దానికి సరిపడా ఆదాయం వొస్తుందా,మనడిపోలో ఉన్న ఉద్యోగులెందరు,వారికి నెలకు మనం ఇస్తున్న జీతాలు ఎంత?కనీసం మన జీతలకు సరిపడా ఆదాయం వొస్తుందా,అనే ప్రతి విషయం గూర్చి తరగతులందు వివరించి, ఒక ఉదాహరణకు ప్రతి ఉద్యోగి తనకు వస్తున్న నెల జీతంతో తన ఫ్యామిలీ  కి ఎలా సరిపుచుకుంటున్నాడు,ఒక వేళ సరిపోకపోతే ఓ టీ  రూపంగా అదనంగా పని చేసి ఆదాయం పెంచుకొని తన ఫ్యామిలి తో ముందుకు సాగిపోతాడో,అలానే మనంకూడా నష్టాల్లో ఉన్న మనడిపోను అదనపు బాధ్యతలతోను ప్రయాణికులను సంస్ధ కు దూరం చేసుకోకుండా ,డీజిల్ ఆదతో మనది అనే భావనతో మనకున్న వనరులతో ఆదాయం పెంచుకొని మన డిపోను ముందుకు నడుపుదామన ఎంతో ధైర్యంతో,ఉత్సహంతో,ఉతేజపరుస్తూ సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు.ఈ తరగతుల మూలన నేడు మన డిపో లాభల్లో ఉన్నది,ఈ కృషి మీ అందరిది ,అని కొనియాడుతూ ఇలాంటి పరిస్థితి ఇక ముందు కూడా ఉండాలని కోరుతూ సిబ్బందిని ప్రశంషిస్తూ తరగతులు ముగించారు.ఈ కార్యక్రమంలో సీ ఐ. ఎస్ టీ ఐ. మరియు సిబ్బంది అందరు  పాల్గొన్నారు.