ప్రజలందరికీ ఆపదలో అండగా ఉంటా

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో – మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 20,( జనంసాక్షి ) :
ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా… అందరికీ అండగా ఉంటామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. వివిధ ఆస్పత్రిలో చికిత్స పొందిన 23 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ ఎఫ్) ద్వారా రూ.15.215 లక్షల చెక్కులను అందజేశారు. అత్యవసర వేళల్లో హాస్పిటల్లో చేరుతున్న అనేకమంది రాత్రీ పగలూ తేడా లేకుండా తనకు ఫోన్ చేస్తుంటారని… అందరికీ మంచి చికిత్స అందేలా తన వంతు కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. చికిత్స అనంతరం సీఎంఆర్ఎఫ్ ద్వారా హాస్పిటల్ ఖర్చులు భరిస్తున్నామన్నారు.  ప్రజలందరికీ ఆపదలో అందుబాటులో అండగా ఉంటామని తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కే వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, ప్రధాన కార్యదర్శి వినోద్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కట్టా రవికిషన్ రెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఫొటొ రైటప్ …
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేస్తున్న మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్.