ప్రజలకు అండగా సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే
ఆదిలాబాద్,మే23(జనం సాక్షి):ప్రజలు అన్ని విధాలా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఏజెన్సీలో ఆదివాసీ గిరిజనులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆర్‌వోఎఫ్‌ఆర్ పథకంలో సాగు చేస్తున్న భూములకు హక్కు పత్రాలు లేనివారికి న్యాయం చేస్తామన్నారు. సమస్యలుంటే ప్రజా ఫిర్యాదుల విభాగంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
—