ప్రజలను నిలువునా మోసం చేస్తున్న వైకాపా
ఒక్క చాన్స్ అంటూ నిలువునా దగా
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ
అమరావతి,డిసెంబర్3 (జనంసాక్షి) : వైసీపీ నాయకులు ఏడాది పొడవునా ప్రజల్ని మోసం చేస్తూ వస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని చెప్పి… ఇస్తేనేమో 420 వేషాలు వేస్తున్నారని దుయ్యబట్టారు. దిశ చట్టం తీసుకొచ్చి విచారణ చేసి, నేరస్థులకు శిక్ష పడుతుందని చెప్పి ఊదరగొట్టారని… అన్నీ ఉత్తమాటలే అని అన్నారు. ఈ దిశ చట్టం ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ విసిరారు. మహిళలకు ఎక్కడా న్యాయం జరగడంలేదని అనురాధ మండిపడ్డారు. ఏడాది నుంచి దిశ చట్టం అమలు చేశాం అని అంటున్నారని… తమరు నిరూపిస్తే 20 సంవత్సరాల తన రాజకీయ జీవితం నుంచి తప్పుకుంటానని తెలిపారు. లేని చట్టం తీసుకొచ్చి మసిపోసి మారేడుకాయ చేశారని.. లేని చట్టానికి సవరణ బిల్లు అని పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అవన్నీ బయటికి వస్తాయని చెప్పి తమ నాయకులను మాట్లాడనివ్వడంలేదని అన్నారు. ఎందుకు మహిళల్ని మోసం చేస్తారని ప్రశ్నించారు.అత్యాచారం జరిగిన వారికి న్యాయం జరగడం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి పనులు చేస్తే తమ విూద 420 కేసులు వేయ్యాలా, లేదా అని నిలదీశారు. అబద్దాలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారని…దీనిపై ¬ం మంత్రి సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. దిశ చట్టం ద్వారా ఎవరికి శిక్ష పడిందో ¬ం మంత్రి సమాధానం చెప్పాలన్నారు. మహిళా కమిషన్ ఛైర్మన్ కూడా దిశ చట్టానికి తలూపడం దగదన్నారు. ఇలా మోసం చేసినందుకు ఆంధ్ర రాష్ట్ర మహిళలు ఏం శిక్ష వేస్తారో నిర్ణయించుకోండి అని పంచుమర్తి అనురాధ అన్నారు.