ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి
– జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు
మహబుబ్ నగర్ ఆర్ సి ,జులై 13 , ( జనంసాక్షి ):
వర్షానికి నాని పడిపోయేందుకు అవకాశం ఉన్న ఇండ్లలోనుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు
అధికారులు అదేశించారు . జిల్లావ్యాప్తంగ గ్రామాలు,మున్సిపాలిటీలలో తిరిగి
పడిపోయే అవకాశం ఉన్న ఇండ్లను గుర్తించండి, ప్రజలను అప్రమత్తం చేయండి అని జిల్లా కలెక్టర్ సూచించారు . జిల్లాలోనిఅన్నిగ్రామాలు,
మున్సిపల్ పట్టణాలలో వర్షం వల్ల నాని పడిపోయేందుకు అవకాశం ఉన్న ఇండ్లను గుర్తించి ప్రజలను అక్కడినుండి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతంలో ఉంచాలని జ్8ల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు అన్నారు.
బుధవారం ఆయన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని తిరుమల దేవుని గుట్ట ప్రాంతంలో తిరిగి స్థానిక వార్డ్ ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వర్షం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? ఇండ్లు నాని పడిపోయేందుకు ఉన్నాయా ? అని అడిగి తెలుసుకోవటమే కాకుండా ప్రత్యక్షంగా ఇండ్లను పరిశీలించారు.అలాంటి ఇండ్లు ఎక్కడైనా ఉంటే వెంటనే ఖాళీ చేయించాలని మున్సిపల్ కమీషనర్ ప్రదీప్ కుమార్ ను ఆదేశించారు. మీ ఇండ్లు ఎలా ఉన్నాయి?,వర్షానికి దెబ్బ తిన్నాయా?భయమేమి లేదుకదా?అని వార్డ్ ప్రజలు రాముల భాయి,గౌషియా బేగం,అబ్దుల్ రహమాన్,ఖాదర్ పాషాల ఇళ్లకు వెళ్లి కలెక్టర్ మాట్లాడారు. టిడి గుట్ట ఉన్నత పాఠశాల ముందు రహదారి తరచు దెబ్బ తింటున్నదని,శాశ్వత మరమ్మతు చర్యలు తీసుకోవాలని వార్డు ప్రజలు జిల్లా కలెక్టర్ ను కోరగా,తక్షణమే సంబంధిత ఇంజనీర్లతో మాట్లాడి చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.మున్సిపాలిటీ లతో పాటు,అన్ని గ్రామాలలో అధికారులు పర్యటించి పడిపోయేందుకు సిద్ధంగా ఉంది ఇళ్లను గుర్తించి ఖాళీ చేయించడం, అలాగే శానిటేషన్,ఆరోగ్యం,తాగునీటి సరఫరా వంటి విషయాలలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని,ముఖ్యంగా నీటి ప్రదేశాలు,జలాశయాలు,వాగులు,చెరు వుల వైపు ఎవరు వెళ్లకుండా ఆపి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు
.టిడి గుట్ట ప్రాంతంలో ప్రజల ఇబ్బందులను తెలుసుకుంటున్న దృశ్యం