ప్రజలు టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పారు : ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ

హైదరాబాద్‌, మార్చి 26 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పారని ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారని ఏమైందని ఆయన ప్రశ్నించారు. ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టుపై కేసీఆర్‌ కుటుంబసభ్యులు తలో మాట మాట్లాడుతున్నారని, ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎంపీ కవిత చెబుతుంటే, ప్రాజెక్టును రీ డిజైన్‌ చేస్తామని కేటీఆర్‌, హరీష్‌రావులు చెబుతున్నారని షబ్బీర్‌అలీ ఆరోపించారు.