ప్రజలే గెలవాలి..వారి ఆకాంక్షలు నెరవేరాలి
ఎన్నికల ప్రచార సభలో సిఎం కెసిఆర్ ఆకాంక్ష
యాదాద్రి అద్భుత క్షేత్రంగా అవతరిస్తుందని వెల్లడి
టిఆర్‌ఎస్ అభ్యర్థుల విజయానికి పాటుపడాలని పిలుపు
యాదాద్రి భువనగిరి,నవంబర్27(జనంసాక్షి): ఆలేరు చాలా చైతన్యం ఉన్న ప్రాంతం అని, ఇక్కడి ప్రజలు చాలా పోరాటాలు చేసారని సిఎం కెసిరా/- అన్నారు. ప్రజాస్వామ్యంలో మంచి పరిణతి రావాల్సి ఉందని, ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. ప్రజల అభీష్టం గెలవాలని, ప్రజలు ఏది కోరుకుంటరో అది జరగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఆలేరు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగిస్తూ..మనకోసం పనిచేసే వాళ్లను గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోకానీ, ఆలేరులోకానీ 58 ఏళ్లలో పాలించిన కాంగ్రెస్, టీడీపీ కూటమి అభ్యర్థి ఒకవైపు..మరోవైపు టీఆర్‌ఎస్ అభ్యర్థి అని అన్నారు. తమకంటే ఘనాపాటిల్లేరని కాంగ్రెస్ గొప్పలు చెప్పింది. కాంగ్రెస్ గొప్పదైతే ఇన్నాళ్లు ఎందుకు కరెంట్ ఇవ్వలేదని సీఎం ప్రశ్నించారు. మోటార్లు కాలితే పండిన పంటంతా పెట్టి రిపేర్లు చేయించాలి. గతంలో కరెంట్ ఎలా ఉండేదో..ఇపుడు ఎలా ఉందో విూకందరికీ తెలుసునన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులకు పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్నమన్నారు. ఒంటరి మహిళలను ఆదుకోవాలని సునీత తనకు చాలా సార్లు చెప్పిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఒంటరి మహిళల అన్నదమ్ములు నాకు ఫోన్ చేసిన్రు. అట్లా ఒంటరి అయినందుకు మా చెల్లెలును, అక్కను చూసుకోవాలని మాకుంటది. అన్నం పెట్టుకోవాలని ఉంటది. సునీత నాకు కూతురుతో సమానమని..ఎమ్మెల్యే తర్వాత అని సీఎం కేసీఆర్ అన్నారు. 2001లో నేను ఒంటరిగా ఉద్యమం మొదలు పెట్టిన సమయంలో చిన్న పిల్లగా నా వెంట ఉండి ఉద్యమంలో పాల్గొన్నది. విూరు దయతలిస్తే జెడ్పీటీసీగా, అన్ని ¬దాల్లో పనిచేసింది. ఏ ఒక్కరోజు కూడా ఓడినా..గెలిచినా ఉద్యమ బాట వీడలేదు. చివరివరకు కేసీఆర్ వెంట ఉండి పోరాటం చేసింది. ఇలాంటి గట్టివాళ్లున్నరు కాబట్టే కేసీఆర్ విజయం సాధించాడని అన్నారు. యాదాద్రి అద్బుతమైన ఆలయంగా ప్రపంచంలోనే విరాజిల్ల బోతున్నదని అన్నారు. గంధమల్ల చెరువుతో పాటు ఇక్కడ పర్యాటక కేంద్రంగా అభివృద్ది కానుందన్నారు. గుండాల మండలాన్ని తిరిగి అధికారంలోకి రాగానే యాదాద్రిలో విలీనం చేస్తామని అన్నారు. అన్నివిధాలుగా అభివృద్దిలో ముందున్న టిఆర్‌ఎస్‌నే గెలిపించాలన్నారు.
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం ఖాయం
అంతకు ముందు మునుగోడులో మాట్లాడుతూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం ఖాయమని స్పష్టం అవుతుందని చెప్పారు. మునుగోడు నియోజకవర్గం చండూరు సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ..ఇక్కడి ప్రజలు గట్టుప్పల్ మండలం కావాలని కోరుతున్నరు. వంద శాతం ఓట్లు వేసి ప్రభాకర్‌రెడిన్డి ఎమ్మెల్యేగా గెలిపించండి. ఆ తర్వాత 15 రోజుల్లోనే జీవో విడుదల చేసి గట్టుప్పల్‌ను మండల కేంద్రం చేస్తా. నేను స్వయంగా వచ్చి ప్రారంభోత్సవం చేస్తానని సీఎం కేసీఆర్ హావిూనిచ్చారు. చౌటుప్పల్‌లో డిగ్రీ కాలేజీ కావాలని కోరుతున్నారు. విూ దగ్గర రీజినల్ రింగ్ రోడ్డు రావాలి. రింగ్ రోడ్డు బ్రహ్మాండంగా 330 కిలోవిూటర్లతోని చౌటుప్పల్ నుంచి మునుగోడు నియోజకవర్గాన్ని చీల్చుకుపోతుంది. దీంతో పెద్ద కనెక్టివిటి మునుగోడు నియోజకవర్గానికి వస్తదని సీఎం కేసీఆర్ అన్నారు. మిషన్ భగీరథ పూర్తవుతుంది. ఇంకో 20 రోజుల్లో ఇంటింటికీ నల్లా ఇచ్చే కార్యక్రమం కూడా పూర్తవుతుంది. మునుగోడు ప్రాంతానికి లక్షా 75 వేల ఎకరాలకు నీళ్లిచ్చే విధంగా డిండి లిప్ట్ ఇరిగేషన్ పథకాన్ని రాబోయే ఒకటిన్నర సంవత్సరంలో పూర్త
చేసి..మునుగోడు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేవరకొండ, మునుగోడు ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని అన్నారు. సంక్షేమ రంగానికి 43 కోట్లు ఖర్చుచేస్తున్నమని సీఎం తెలిపారు. యాదవ సోదరులకు 70 లక్షల గొర్రెలు పంపిణీ చేసినం. ధనవంతులైన యాదవులు ఎక్కడున్నారంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నరని మనకు పేరొస్తది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాకముందు కరెంట్ ఎట్లా ఉండే..ఇప్పుడు కరెంట్ ఉందో చూసుకోవాలని సీఎం ప్రజలకు సూచించారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ.లక్షా 116 ఇస్తున్నాం. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని విధంగా కంటి వెలుగు కార్యక్రమం జరుగుతుంది. హైదరాబాద్‌లో లిక్కర్ మాఫియా ఒత్తిళ్లకు లొంగి గౌడ కులస్థులకు అన్యాయం చేసిన్రు. గీతకార్మికులకు చెట్ల పన్ను చెల్లించే అవసరం లేకుండా రద్దు చేశాం. గీతకార్మికుల సంకేమం కోసం 5 కోట్ల ఈత, తాటి మొక్కలు నాటుతున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. నీటి తీరువా పన్ను రద్దు చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకం అమలు చేస్తున్నమన్నారు.