ప్రజల అనుమతి లేకుండా నిత్యావసరాల ధరలు పెంచకూడదు: కేజ్రీవాల్
ఢిల్లీ: అందరూ అంటున్నట్లు ఇది నా పార్టీ కాదు, మీ పార్టీ ప్రజల పార్టీ అని చెప్పారు. అరవింద్ కేజ్రీవల్ పార్టీ పేరు పెట్టలేదు కాని పలు వధివిధానాలను ఈరోజు ఆయన ప్రకటించారు. ప్రజల అనుమతి లేకుండా నిత్యావసరాల ధరలు పెంచకూడదన్నది తమ విధానమని ఆయన పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ వసతిని వాడుకోవడం సెక్యూరిటీ సిబ్బంది, ఎర్రబల్బుతో ఉండే వాహనంతో హంగామా లాంటివాటిని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అక్టోబరు ఆరుతేదీన ఇద్దరు ప్రముఖుల గుట్టును తమ బృందం బయటపెట్టనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.



