ప్రజల ఐకమత్యమే దేశానికి బలం

3
రాష్ట్రపతి ప్రణభ్‌

దిల్లీ, జనవరి 25(జనంసాక్షి): దేశ ప్రజలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశమాత విముక్తి కోసం పోరాడిన అసంఖ్యాక యోధులకు ఆయన నివాళులర్పించారు.దేశ చరిత్రలో 2014 ఒక మైలురాయివంటిదని ఆయన పేర్కొన్నారు. భారత ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకున్నారని, 30 ఏళ్ల తర్వాత ఒకే పార్టీకి పూర్తి మెజార్టీ అప్పగించారని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. దీంతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందన్నారు. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు మార్గదర్శి అని పేర్కొన్నారు.

ఐకమత్యమే భారత్‌ బలమని చెప్పారు. రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని ఆదివారం రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్థికంగా పురోభివృద్ధి సాధించడం ప్రజాస్వామ్యానికి ఓ పరీక్ష అని ప్రణబ్‌ అన్నారు. ఏ దేశమైనా మహిళలను, మహిళా సాధికారితను గౌరవిస్తేనే అగ్రదేశంగా ఎదుగుతుందని పేర్కొన్నారు. ఉగ్రవాదం పెను సవాల్‌ గా మారిందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.