ప్రజల చెంతకు టెక్నాలజీ

3

ఇస్రో చైర్మన్‌తో ఐటీ మంత్రి కె.తారకరామారావు భేటీ

హైదరాబాద్‌,ఆగస్టు 6(జనంసాక్షి):

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సాంకేతిక సొబగులు అద్దేందుకు మంత్రి కేటీఆర్‌ కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఇస్రో చైర్మన్‌ కిరణ్‌ కుమార్‌ తో ఆయన భేటీ అయ్యారు. హైదరాబాద్‌ లోని ¬టల్‌ గ్రాండ్‌ కాకతీయలో జరిగిన ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చించారు. ముఖ్యంగా సామాన్య ప్రజల చెంతకు టెక్నాలజీని తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని మంత్రి కేటీఆర్‌, కిరణ్కుమార్‌ కు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సాఫ్ట్‌ నెట్‌ టీవీ విస్తరణకు ఇస్రో సహకరించాలని కేటీఆర్‌ కోరారు. రాష్ట్రంలో విద్య, నైపుణ్య అభివృద్ధికి శాటిలైట్‌ టీవీ విూడియాను ప్రభావవంతంగా ఉపయోగించుకునేందుకు ఇస్రో సహకారం అవసరం అన్నారు. కేటీఆర్‌ విజ్ఞప్తి మేరకు ఇస్రో పూర్తి సహకారం అందిస్తుందని కిరణ్‌ కుమార్‌ తెలిపారు.మిషన్‌ భగీరథ ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును మంత్రి కేటీఆర్‌ ఇస్రో చైర్మన్‌ కు వివరించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభం ప్రధాని నరేంద్రమోడి చేతుల విూదుగా జరగబోతున్నదని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఇంటింటికి రక్షిత తాగునీటితో పాటు ఇంటర్నెట్‌ ను సైతం అందించనున్నట్లు వివరించారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టుతో పాటు ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు కేటీఆర్‌ ఇస్రో చైర్మన్‌ కు చెప్పారు. పల్లెల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచేందుకు ఫైబర్‌ గ్రిడ్‌ ఉపయోగపడుతుందన్నారు కేటీఆర్‌. ఈ ప్రాజెక్టు పూర్తయితే గ్రామాల ముంగిట్లోకి ఈ ఎడ్యుకేషన్‌, ఈ -హెల్త్‌ వంటి సౌకర్యాలు వస్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ- పంచాయతీ ద్వారా ప్రభుత్వ సేవలను గ్రావిూణ ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తేవాలన్నది ప్రభుత్వ ధ్యేయంగా మంత్రి వివరించారు.ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ లో ఇస్రో భాగస్వామి కావాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఇస్రో చైర్మన్‌ తమ పూర్తి సహకారం ప్రభుత్వానికి ఇస్తామని హావిూ ఇచ్చారు. ఇస్రో రూపొందించిన భువన్‌ సాఫ్ట్‌ వేర్‌ ద్వారా చేపట్టగలిగే పలు కార్యక్రమాలను మంత్రికి తెలిపారు.