ప్రజల మనసులను గెల్చుకునే ప్రయత్నాల్లో బిజెపి విఫలం

భారత్‌ వెలిగిపోతోందంటూ వాజ్‌పేయ్‌ హయాంలో బాగా ప్రచారం చేసుకున్న బిజెపి, ఆ తరవాత ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డది. మళ్లీ పదేళ్ల వరకు దాని గురించి ఎవరు కూడా పెద్దగా ఆలోచన చేయలేదు. మోడీ వచ్చిన తరవాత ప్రచారం వ్యూహాత్మకంగా కొనసాగడంతో బిజెపి పూర్తి ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. అయితే గత రెండేళ్లుగా కేంద్రంలో ఉన్న బిజెపి అనేక విధాలుగా ప్రచారం చేసుకుంటూ పోతోంది. ప్రధానంగా అవినీతిని దూరం పెట్టామన్నది ఇందులో ప్రధానమయినది. అయితే ఇదంతగా ప్రజలకు నచ్చే గుణంగా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రజలు కోరకుంటున్న మౌళిక సమస్యలు ఇంకా అలాగే ఉన్న సమయంలో ఇలాంటి ప్రచారం పెద్దగా ప్రాధాన్యం కలిగిస్తుందని అనుకోవడానికి లేదు. ఇప్పటి వరకు జరిగిన వివిధ రాష్టాల్ర ఎన్నికల్లో దీనిని  ప్రచారం చేశారు. అయినా పెద్దగా ఆశించిన ఫలితాలు రాలేదు. ఒక్క అసోం తప్ప ఎక్కడా బిజెపి బలపడిన దాఖాలాలు కానరావడం లేదు. తమిళనాట అవినీతిలో కూరుకుపోయినా జయలలితను ఆరాధించారు. బీహార్‌లో లాలూ కుంభకోణాలను అంతా మరచి పోయారు. అంటే ప్రజలకు కావాల్సింది పనులు, సమస్యలపై చొరవ. ఇవి గుర్తించకుంటే బిజెపి మరో మూడేళ్ల తరవాత మళ్లీ కనుమరుగు అయ్యే  ప్రమాదం లేకపోలేదు. ఇవన్నీ గుర్తుకు పెట్టుకుని బిజెపి అడుగులు వేయాలి. తాత్కాలికంగా కొన్ని  రాష్టాల్ల్రో విజయం సాధించడం లక్ష్యం కారాదు. అలాగే యూపిలాంటి ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ ఉండరాదు. రాష్టాల్ల్రో గెలుపన్నది ప్రజలు స్వచ్చంధంగా ముందుకు వచ్చి అందించేదిగా ఉండాలి. ఈ తరుణంలో అలహాబాద్‌ విూటింగ్‌లో కేవలం యూపి ఎన్నికలే లక్ష్యంగా  భారతీయ జనతా పార్టీ (బిజెపి) తన నేతలు, కార్యకర్తలకు కొత్త దశ దిశ నిర్దేశించే విధంగా అడుగులు వేసింది. ఈ క్రమంలో మరింత కష్టపడి పని చేయవలసిందిగా పార్టీ కార్యకర్తలకు బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా పిలుపు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ విజయాలను ప్రజానీకానికి ప్రచారం చేయాలని ఆయన కార్యకర్తలకు ఉద్బోధించారు. ఉత్తర ప్రదేశ్‌లో వచ్చే సంవత్సరం జరగనున్న శాసనసభ ఎన్నికలలో పూర్తి మెజారిటీ సాధించి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదన్న దృఢ విశ్వాసాన్ని అమిత్‌ షా వ్యక్తం చేశారు. 2017ను సవాళ్ల సంవత్సరంగా అభివర్ణించారు. ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్టాల్రలో 2017లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. 2017లో యుపిలోను, 2019లో కేంద్రంలోను బిజెపి తిరిగి అధికారంలోకి వస్తుందనే దృఢ విశ్వాసాన్ని కూడా బిజెపి అధ్యక్షుడు వ్యక్తం చేశారు. విశ్వాసం వేరు ప్రజల్లో విశ్వాసం పొండదం వేరు. ఈ రెండు తేడాలను గుర్తించకుంటే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే మళ్లీ వస్తాయి. ఉత్తర ప్రదేశ్‌లోని మథుర, కైరానాలలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలపై సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వంపై ఎంతగా ప్రభావం ఉంటుందో బిజెపిపైనా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అఖిలేష్‌ యాదవ్‌ ప్రభుత్వాన్ని అమిత్‌ షా తూర్పారపట్టడం కన్నా చేయూతను  అందించి ముందుకు సాగాలి. ఇకపోతే అగ్రకులాలకు, కార్పోరేట్లకు మాత్రమే బిజెపి ప్రాతినిధ్యం వహిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. ధరల పెరుగుదలను అరిక్టటడంలో విఫలం అంటే కార్పోరేట్లకు మద్దతు పలకడం అన్నది ప్రజల్లో నాటుకున్న భావన. రెండు పార్లమెంటు సీట్ల నుంచి కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే లెక్కలేనన్ని సవాళ్లను ఎదుర్కొంది. ఇప్పటికీ ఇంకా ఎదుర్కొంటూనే ఉంది. రానున్న రోజుల్లో ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల రూపంలో మరో పెను సవాల్‌ను కూడా బిజెపి ఎదుర్కొనాల్సి వస్తున్నది. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి కూడా సవాల్‌గా సమస్యలను పరిష్కరించిన దాఖలాలు  ప్రధాని నరేంద్రమోడీకి లేవనే చెప్పాలి. ్గ/రిగిపోతున్న ప్రజావసరాలు తీర్చాల్సిన బాధ్యత తరుముతూనే ఉంది. వీటన్నింటిని మించి ఇంత కాలం కాంగ్రెస్‌ పార్టీ నెలకొల్పిన సాంప్రదాయాలను సమూలంగా మార్చాల్సిన ఎజెండా ఉండనే ఉంది. ఇన్ని సవాళ్ల మధ్య బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో దిశా నిరద్‌ఏశం చేసేదిగా ఉండాలి. కానీ కేవలం యూపి తదితర ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే సాగింది.  నరేంద్ర మోడీ పట్ల దేశ వ్యాప్తంగా ప్రజల్లో ఏర్పడిన ఆకర్షణను ఆసరాగా తీసుకొని అన్ని రాష్టాల్రలో బలమైన పార్టీగా ఎదగాలని, ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ అధికారం తమదే అన్న విధంగా ఉండాలని బిజెపి వేస్తున్న ఎత్తుగడలు గత కొద్ది కాలంగా పారడం లేదు. ఇటీవల ముగిసిన ఐదు రాష్టాల్ర  ఎన్నికలు, అంతకు ముందు బీహార్‌, ఢిల్లీ ఎన్నికలు బిజెపికి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ఏడు నుంచి తొమ్మిది పెద్ద రాష్టాల్లో బిజెపి ఉనికే లేని పరిస్థితి ఇంకా ఉంది. దేశవ్యాప్తగా చూస్తే ఓట్ల శాతం 30 శాతానికి మించడం లేదు. ఇవన్నీ బిజెపికి అధికారంలోకి వచ్చిన ఆనందాన్ని మిగల్చడం లేదు. ఎందుకంటే ఈ అంశాలు సరిదిద్దుకోగలిగితేనే 2019 లోక్‌సభ ఎన్నికలు ఆశాజనకంగా ఉంటాయి. అందుకు పాలనా పరంగా విప్లవత్మక పనులకు శ్రీకారం చుట్టాలి. గతంలో వెలగిపోతోందంటూ ఇప్పుడు అవినీతికి దూరంగా పాలన అంటూ ప్రచారం చేసుకుంటే కుదిరే పని కాదు. ప్రజలలోకి వెళ్లేందుకు బిజెపి తీసుకుంటున్న చర్యలు చాలా రాష్టాల్లో సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ఇవన్‌ఈన గుర్తించకుండా సాగితే నష్టపోతామన్న భయంతో కార్యాచరణచేయకుంటే బిజెపికి దుర్గతి తప్పదు.