ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

నూతన ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

వీపనగండ్ల ఆగస్టు 28 (జనంసాక్షి) మండల కేంద్రంలోని ఆదివారం నాడు వివిధ గ్రామాలైన వల్లభాపురం 58, తూముకుంట 106, సంగినేనిపల్లి 93, కల్వరాల 137, పుల్గర్ చర్ల 69, గ్రామాలలో స్వయంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పర్యటించి నూతన ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది.ఈ గ్రామాలలో రచ్చబండపై కూర్చుని లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడిన అనంతరం వారికి ఆసరా పెన్షన్ కార్డులను అందజేశారు.
అందరి పోరాటంతో తెలంగాణను సాధించుకున్నాం.అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ అందించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్ ప్రతి పేదింటి పెద్ద కొడుకుగా ప్రతి కుటుంబానికి బాసటగా నిలిచారని అన్నారు.
57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ అందిస్తామని,
తెలంగాణ రాకముందు దరఖాస్తు ఇచ్చి దండంపెట్టిన గత పాలకులు పెన్షన్లు ఇచ్చిన పాపాన పోలేదు.
కొత్తగా పెన్షన్ రావాలంటే మరొకరి చావు కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి,స్వయం పాలనలో అర్హులైన అందరికీ ఆసరా పింఛన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పారు.
తెలంగాణ రాకముందు మన అందరం ఉన్నాం కానీ… అర్హులైన వారికి పెన్షన్ ఇవ్వాలని మనస్సు నాటి పాలకులకు రాలేదు.
తెలంగాణ వచ్చిన తర్వాత స్వయం పాలనలో ఇక్కడి సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి.
వ్యవసాయం కోసం 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నాం,సాగు పెట్టుబడి కోసం రైతుబంధునిస్తున్నాం.
గతంలో ఎరువుల కోసం రైతన్నలు లాటి దెబ్బలు తిన్న పరిస్థితులు… కానీ స్వయం పాలనలో రైతన్నలకు ఎరువుల సమస్య లేకుండా పోయింది,రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కోసం ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో రైతులతో పాటు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు బిజెపి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదు.
స్వయం పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి 2016 రూపాయల పెన్షన్ అందిస్తున్నాం.
ఆసరా పెన్షన్లతో… అవసరాలకు ఇతరుల పై ఆధార పడకుండా లబ్ధిదారుల ఆత్మగౌరవం పెరుగుతోంది.
ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే,మీ బాగోగులు చూసే ఏకైక పార్టీ టిఆర్ఎస్  మాత్రమే.
అర్హులైన వారందరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామంలోని రచ్చబండపై కూర్చుని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే గ్రామంలో సాగునీరు సమస్య ఉంది అని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా రైతుల సాగునీరు కష్టాలు తీర్చేందుకు సింగోటం గోపాల్ దీన్నే లింకు కెనాల్ పనులు జరుగుతున్నాయని ఆ పనులు జరుగుతే పూర్తిస్థాయిలో చివరి ఆయకట్టు కొరకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే తూముకుంట గ్రామం నుండి చిన్న కొండూరు వెళ్లే మార్గ మధ్యలో బ్రిడ్జి నిర్మాణం దశాబ్దాలుగా పెండింగ్లో ఉందని ప్రత్యేక చొరవ తీసుకొని రివైజ్డ్ ఎస్టిమేషన్ చేయించి దాదాపు 5 కోట్లకు పైగా రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధమై టెండర్ల దశలో ఉన్నాయని త్వరలో పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే అన్నారు. అదేవిధంగా సంగినేనిపల్లి గ్రామం నుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు రోడ్డు సౌకర్యం కావాలని గ్రామస్తులు కోరగా కొద్ది రోజుల క్రితమే దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపామని సాధ్యమైనంత తొందరగా రోడ్డు వేయిస్తామని ఎమ్మెల్యే  హామీ ఇచ్చారు. అలాగే కల్వరాల గ్రామంలో నూతనంగా రోడ్డు ఏర్పాటు చేశామని గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతుందని మరికొన్ని రోడ్లు వేయాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వారు స్పందించి సాధ్యమైనంత తొందరగా రోడ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే పుల్గర్ చర్ల గ్రామం నుండి శ్రీరంగాపూర్ డబుల్ లైన్ రోడ్డుకు మూడు కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపామని త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభం అవుతాయని ఈ సందర్భంగా తెలిపారు. పింఛన్ రానివారు అధైర్యపడవద్దని అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్స్ వస్తాయని అప్లై చేసుకోని వారు ఉంటే చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు,అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.