*ప్రజాగోస బిజెపి భరోసా బైక్ ర్యాలీ*
మెట్పల్లి టౌన్ ,సెప్టెంబర్ 23 :
జనం సాక్షి
ప్రజగోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీ మెట్ పల్లి పట్టణంలో జెండా ఉపి జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావ్ పాల్గొన్నారు. అనంతరం పాత బస్టాండ్ లో జరిగిన సభ లో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే గా గెలిస్తే రాష్ట్రం లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ ని తెరిపిస్తానని లేకపోతే ఉరి వేస్కుంటా అని రైతులకు హామీ ఇచ్చి మోసం చేసి ఇప్పటి వరకు ఎమ్మెల్యే కి ఉరివేసుకోవడనికి తాడు కూడ దొరుకుతాలేదని ఆరోపించారు. టిఆర్ఎస్ పాలనలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కానీ, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్న హామీ కలగానే మిగిలిందని విమర్శించారు. రాష్ట్రంలో ఉగ్రవాదుల కార్యకలాపాలు జగిత్యాల నిజామాబాద్ జిల్లా కేంద్రాలుగా నడుస్తున్న రాష్ట్రం లో ఉన్న నిగ వ్యవస్థలు టిఆర్ఎస్ హయం లో మొద్దు నిద్ర పోతున్నాయని విమర్శించారు. గతంలో కోరుట్ల లో బీజేపీ ఎమ్మెల్యే లు చేసిన అభివృద్ధి మాత్రమే కనపడుతుంది . రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు బోడ్ల రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధోనికేల నవీన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్, జె ఎన్ వెంకట్ సునీత, సురభి నవీన్, తుల ఉమ, బాద్హాం గంగాధర్, గుంటుక సదాశివం, ఫ్లోర్ లీడర్ మీనా సుఖేందర్ గౌడ్ , మర్రి పోచయ్య, గంప శ్రీను, మన్నే గంగాధర్, సుంకేట విజయ్, బోడ్ల నరేష్, రమేష్ యాదవ్, ఆర్మూర్ రంజిత్, బోడ్ల నగేష్,తోకల గంగానర్సయ్య, కొయ్యల లక్షమాన్, బోడ్ల గౌతమ్, కుడుకల రఘు, తోట ప్రసాద్, బండారి రమేష్, కలికోట శ్రీకాంత్, బీమనతి విజయ్, యమా విజయ్, కోయల్కర్ లింగేశ్వర, పసునూరి ఆనంద్, ముద్రకోలా రాజ్ కుమార్, బోడ్ల అనిల్, కోయల్కర్ రాజ్కుమర్, పంపట్టి ఆనంద్, సుద్దాల రోహిత్ తదితరులు పాల్గొన్నారు.