ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి -అధికారుల ఆదేశించిన జిల్లా కలెక్టర్.

 

 

 

 

 

 

గద్వాల నడిగడ్డ, డిసెంబర్ 12 (జనం సాక్షి);
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారి నుండి దరఖాస్తులు స్వీకరించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజావాణిలో (53) దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటిక్యాల మండలం సాతర్ల గ్రామం సర్వే నెం.128 , చాగపురం సర్వే నెం. 633 గ్రామాల నుండి భూములకు సబంధించిన దరఖాస్తుదారులు భూమి వేరే వారి పేర్లు చుపిచడం జరుగుతుందని తెలిపారు. ఇటిక్యాల తహశిల్దార్ కు సర్వే నెంబర్ కు సంబంధిచిన రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు, గట్టు , అయిజ మండలాల వివిధ భూ సమస్యలు వచ్చినవి తెలిపారు. భూ సమస్యలకు సంబంధించి తక్షణమే రిపోర్ట్ ఇవ్వాలని తాసిల్దారులను ఆదేశించారు. అట్టి సమాచారాన్ని దరఖాస్తుదారులకు వివరంగా తెలియపరచాలన్నారు.
విద్యా శాఖ 2 ,వ్యవసాయ శాఖ 2 ,ఆసరా పెంక్షన్ లు 12 , భూ సమస్యలు 37 మొత్తం 53 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణి ద్వారా మరింత వేగంగా సేవలు అందించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. భూ సమస్య లు, ఆసరా పెన్షన్, భూ తగాదాలు తదితర అంశాలపై దరఖాస్తు లు వచ్చాయని తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్,ఎ ఓ యాదగిరి,జిల్లా అధికారులు, తహశిల్దార్ లు తదితరులు పాల్గొన్నారు.