ప్రజావాణి ద్వారా రైతుల నుండి వచ్చే భూ సమస్యలను వెంటనే పరిష్కరించండి
-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 12 (జనం సాక్షి);
ప్రజావాణి ద్వారా రైతుల నుండి వచ్చే భూ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలు నుండి అన్ని మండలాల తహసీల్దార్లుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్సు లో కలెక్టర్ మాట్లాడుతూ ధరణి టి ఎం 33 లో పరిష్కరించాల్సిన సమస్యలను మిస్సింగ్ పేర్లు, విస్తీర్ణం , మిస్సింగ్ సర్వే నెంబర్లు, ఖాతా మార్పిడి, ఇతరముల అన్నింటికీ సంబంధించి చాలా వరకు పెండింగ్ లో ఉన్నవని, రిజెక్ట్ చేయకుండా పెండింగ్ ఉన్న వాటిని వారం లోగ పహని, ఆర్ ఓ ఆర్ చెక్ చేసి వెంటనే మండలం వారిగా వాటిని క్లియర్ చేయాలనీ తహసిల్దార్లకు ఆదేశించారు. మండలాలలో పేర్లు మిస్సింగ్ సర్వే నెంబర్లు ఐడెంటిఫై చేయాలని, ఎచ్ ఆర్ సి రిపోర్ట్స్ , కోర్ట్ కేసులు ,లోక యుక్త త్వరగా పూర్తి చేసి పంపించాలని తహసిల్దార్లకు ఆదేశించారు. భూ సమస్యలను పరిష్కరించే విధంగా తహసీల్దార్లు కృషి చేయాలన్నారు. రైతుల నుండి వచ్చే సమస్యలనురిజిస్టర్ లో నమోదు చేసుకుని వాటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలన్నారు. ఫిర్యాదుల రోజు వచ్చిన ఫిర్యాదులను రిజిస్టర్ లో నమోదు చేసి పరిష్కరించిన వాటి నివేదిక పంపాలన్నారు. ప్రతి మండలం లో ప్రతి ఒక్కరికి ఓటరు ఐ డి కార్డు కు ఆదార్ నమోదు స్పీడప్ చేయాలని ఆదేశించారు. బూత్ లెవల్ అధికారులు మహిళా సంఘాల సమావేశాలు నిర్వహించి ఆదరర్ నమోదు పై అవగాహన కల్పించాలన్నారు. మండలంలో చని పాయిన వారి పేర్లు నమోదు చేసి ఓటరు లిస్టు లో డిలేట్ చేయాలనీ తెలిపారు.
ప్రజా వాణి ద్వారా వచ్చే భూ దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించి పెండింగ్ లో ఉండకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ప్రజా వాణి ద్వారా 56 పిర్యాదులు వచ్చా యని,45 భూ సమస్యలు వచ్చాయని,11 ఆసరా పెన్షన్లు ఇతర సమస్యలు వచ్చా యని ,వాటిని సంబందిత అధికారులకు పంపి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని పిర్యాదు దారులకు హామీ ఇచ్చారు.
జిల్లా లో 16,17,18 మూడు రోజులు జరిగే తెలంగాణా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో వై ఎస్ ఆర్ చౌక్ నుండి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలి నిర్వహించబడుతుందని,అక్కడే భోజనాలు కౌంటర్ వారిగా ఏర్పాటు చేయడం జరుగుతుందని,అదేవిదంగా వడ్డేపల్లి మండలం శాంతినగర్ లో అంబేద్కర్ చౌక్ నుండి ర్యాలి ఉంటుందని , మండలం వారిగా బస్సులు ఏర్పాటు చేసి ప్రజలు పెద్ద సంఖ్యలో ర్యాలి లో పాల్గొనే విదంగా చూడాలని అన్నారు. 17 ఉదయం పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకావిష్కరణ ఉంటుందని, అదే రోజు హైదరాబాదు లో జరిగే ముఖ్య మంత్రి సమావేశానికి జిల్లా నుండి ఎస్ టి అధికారులు, ప్రజప్రతినిదులు, సిబ్బందిని తీసుకెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి బస్సు కు లైసన్ అధికారులను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 18 న సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాములు ,జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.