ప్రజా పంపిణీకి నాణ్యమైన బియ్యాన్ని తరలించాలి.

అదనపు కలెక్టర్ మోతిలాల్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై28(జనంసాక్షి):

తెలకపల్లి అచ్చంపేట మండలాల్లోని రైస్ మిల్స్ ను, ప్రజా పంపిణీ స్టాక్ పాయింట్లును గురువారం జిల్లా అదనపు కలెక్టర్ ఎస్. మోతిలాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సీఎంఆర్ డెలివరీ,గన్నిబ్యాగులు లభ్యతను పరిశీలించారు.సీఎం ఆర్ డెలివరీ లలో వేగం పెంచాలని మిల్ కు కేటాయించిన ధాన్యం వెనువెంటనే అన్లోడ్ చేసుకోవాలని అన్నారు.సిఎంఆర్ బియం డెలివరీలను వేగవంతం చేసేందుకు ప్రతి మిల్లుకు ఒక సూపర్వైజర్ అధికారిని నియమించడం జరిగిందన్నారు.ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మిల్లుల యజమానులు ఎఫ్ సి ఐ, సి ఎం ఆర్ తరలింపుల్లో జాప్యం లేకుండా చూడాలన్నారు.రోజువారి లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.అదేవిధంగా జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీకి పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.నేటి నుంచి స్టాక్ పాయింట్ల నుండి ప్రజా పంపిణీకి చేరవేసే బియ్యాన్ని ఆయన పరిశీలించారు.సకాలంలో నాణ్య మైన బియ్యాన్ని లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆయన ఆదేశించారు.
ఆగస్టు ఒకటో తేదీ నుండి లబ్ధిదారులకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలని ఆదేశించారు.జిల్లాలోని 558 చౌక ధర దుకాణాలకు 10 వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని స్టాఫ్ పాయింట్ల నుండి రేషన్ దుకాణాలకు తరలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.లబ్ధిదారులకు పంపిణీ చేసే ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు, డి ఎం సివిల్ సప్లై బాలరాజ్, స్థానిక అధికారులు తదితరులు ఉన్నారు.