ప్రజా సంగ్రామ యాత్రలో వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్.

తాండూరు అగస్టు 23(జనంసాక్షి)భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గ నాయకులు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నారు. బండి సంజయ్ తో ప్రత్యేకంగా రమేష్ కుమార్ తోమాట్లాడుతూ ప్రజా సంగ్రామ యాత్ర అనంతరం తాండూర్ కు సమయం కేటాయించాలని కోరగా సంగ్రామ యాత్ర అనంతరం సమయం కచ్చితంగా కేటాయిస్తానని తెలిపారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బంటరం భద్రేశ్వర్ , ఓబీసీ మోర్చా పెద్దముల మండల అధ్యక్షులు కందనెల్లి మహేష్ , బీజేవైఎం నాయకులు అభిలాష్ పండిత్, నరేష్ సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ మారుతి చారి,ఓబిసి మోర్చా జిల్లా నాయకులు జగన్ ముదిరాజ్, సిజేవైఎం సన్నీ,కిసాన్ మోర్చా తాండూరు అధ్యక్షుడు ప్రహ్లాద జాదవ్, పట్టణ ప్రధాన కార్యదర్శి దోమ కృష్ణ , సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.