ప్రణబ్‌కు ఐవరీ కోస్ట్‌ అత్యున్నత పురస్కారం

3

న్యూఢిల్లీ,జూన్‌ 7(జనంసాక్షి):రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పశ్చిమాఫ్రికా దేశమైన ఐవరీ కోస్ట్‌ అందిందే అత్యున్నత పురస్కారం (నేషనల్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది రిపబ్లిక్‌)ను అందుకోనున్నారు. ఈ మేరకు ఐవరీ కోస్ట్‌ అధ్యక్షుడు అలాస్సానే ఉట్టారా రాష్ట్రపతి ప్రణబ్‌ ను తమ దేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.ఈ నెల 14న రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ఐవరీ కోస్ట్‌కు వెళ్లనున్నారు. భారత రాష్ట్రపతి గౌరవప్రదమైన ¬దాలో ఐవరీ కోస్ట్‌ పర్యటనకు వెళ్లడం మొదటిసారి కావడం విశేషం. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్‌, అలాస్సానే ఇరుదేశాల మధ్య కీలక అంశాలపై చర్చించనున్నారు.