ప్రణబ్‌ జీ.. జర దేఖో!

1

129 మంది ఎమ్నెల్యేలతో నితీష్‌ పరేడ్‌

పాట్నా,ఫిబ్రవరి11(జనంసాక్షి): బీహార్‌ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఓ వైపు నితీశ్‌ తనకు మద్దతిస్తున్న 130 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రపతిని కలిశారు. తనకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పంపాల్సిన అవసరం గవర్నర్‌ పై ఉందని నితీష్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్రపతి చొరవ తీసుకోవాలని కోరారు. మరోవైపు నితీష్‌ కుమార్‌కు ఆ రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురయ్యింది. నితీశ్‌కుమార్‌ను జేడీయూ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోవడంపై ప్రస్తుత సీఎం జితన్‌ రాంమాంఝీ మద్దతుదారులు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీంతో నితీశ్‌కుమార్‌ ఎన్నికపై కోర్టు స్టే విధించింది. ఇది చెల్లదని తెలిపింది. శాసనసభా పక్ష నేతను స్పీకర్‌ నామినేట్‌ చేయడం చట్ట విరుద్ధమని కోర్టు పేర్కొంది. ఈ విషయంలో గవర్నర్‌ తుది నిర్ణయం తీసుకుంటారని కోర్టు తెలిపింది. బీహార్‌ సీఎం కుర్చీ కోసం నితీశ్‌కుమార్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు. తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానించాలని గవర్నర్‌ త్రిపాఠిని నితీశ్‌కుమార్‌ కోరిన విషయం తెలిసిందే. జేడీయూ శాసనసభాపక్షనేతగా నితీశ్‌కుమార్‌ ఎన్నికపై పట్నా హైకోర్టు స్టే ఇవ్వడంతో ఇప్పుడు మంజీకి ఊరట కలిగింది.  జేడీయూ సమావేశం నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు పేర్కొంది. నితీశ్‌ ఎన్నికపై బిహార్‌ ముఖ్యమంత్రి జితన్‌రామ్‌ మాంఝీ మద్దతుదారులు హైకోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలు చేయగా దీనిపై న్యాయస్థానం స్పందించింది.  ఈ విషయంలో గవర్నర్‌ తుది నిర్ణయం తీసుకుంటారని కోర్టు తెలిపింది. బీహార్‌ సీఎంగా మరోమారు బాధ్యతలు తీసుకోవాలని కలలు కన్న నితీశ్‌కుమార్‌కు ఈ నిర్ణయం శరాఘాతంగా భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు గవర్నర్‌ నిర్ణయమే అంతిమం కానుంది.  తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానించాలని గవర్నర్‌ త్రిపాఠిని నితీశ్‌కుమార్‌ కోరిన విషయం తెలిసిందే.