ప్రణబ్ జీ.. జోక్యం చేసుకోండి
– వర్సిటీల కాషాయీకరణ అడ్డుకోండి
– 17 మంది కాంగ్రెస్ ప్రతినిధులు రాష్ట్రపతికి ఫిర్యాదు
– నా రక్తం లోనే దేశభక్తి ఉంది: రాహుల్
న్యూఢిల్లీ,ఫిబ్రవరి 18(జనంసాక్షి):జేఎన్‌యూ అంశంపై వస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానం ఇస్తున్న రాహుల్ ఈ వ్వయహారాన్ని రాష్ట్రపతికి ఫిర్యాదుచేశారు. మరోవైపు రాహుల్ దేశద్రోహులకు వత్తాసు పలుకుతున్నారని ప్రముకయోగా గురువు బాబా రాందేవ్ మండిపడ్డారు. బీజేపీ, కేంద్రం అనుసరిస్తున్న తీరుతో పాటు తాజా పరిణామాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాహుల్ గాంధీ నేతృత్వంలోని 17 మంది కాంగ్రెస్ నేతల బృందం ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా రాహుల్ విూడియాతో మాట్లాడుతూ.. దేశభక్తి నా రక్తంలోనే ఉందన్నారు. పాటియాలా కోర్టు వద్ద జర్నలిస్టులపై దాడి అవమానకరమని పేర్కొన్నారు. దాడి జరుగుతున్నా పోలీసులు చూస్తూ ఊరుకోవడం దారుణమన్నారు. దేశం కోసం తమ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని గుర్తు చేశారు. యూనివర్సిటీల్లో భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. తమ సిద్ధాంతాలను విద్యార్థులపై రుద్దేందుకు ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. తన రక్తంలోనే జాతీయ భావం ఉందని రాహుల్ గాందీ అన్నారు. దీనిని ఎవరూ శంకించడమోలేదా ప్రశ్నించడమో చేయలేరన్నారు. జవహర్ లాల్ యూనివర్శిటీలోను, ఆ తర్వాత కోర్టులోను జరిగిన వివిధ ఘటనలపై రాష్ట్రపతికి కాంగ్రెస్ నేతలతో కలిసి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తమ కుటుంబం త్యాగాలు అందరికి తెలిసినవే అని ఆయన అన్నారు. దేశభక్తి తన హృదయంలో ఉందని, తన జాతీయ భావాలను ప్రశ్నించే హక్కు బిజెపికి లేదని ఆయన అన్నారు. ఎవరైనా జాతి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చని అన్నారు. కాని ప్రభుత్వం ప్రముఖ విద్యా సంస్థలను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తోందని అన్నారు.ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఎంతకైనా వెళుతున్నారని ఇది ప్రమాదకరమని అన్నారు.బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో విూడియాపై కూడా స్వైరవిహారం చేస్తూ దాడులు చేస్తున్నారని, ఇది ప్రమాదకరమైన అంశమని ఆయన అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు ఉన్నారు. కాగా పాటియాల హౌస్ కోర్టులో లాయర్లు దాడులు చేయడంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అద్యక్షుడు సుప్రింకోర్టుకు క్షమాపణ చెప్పారు. ఆ ఘటనలన్నిటి పైన విచారణ నిమిత్తం సుప్రింకోర్టు కమిటీని నియమించింది. ఇదిలావుంటే జెఎన్‌యూ ఘటనలపై ఎబివికి చెందిన ముగ్గురు విద్యార్థుల తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనలకు నిరసగా వారు పరిసత్‌కు రాజీనామా చేశారు. ‘కన్హయ్య నిందితుడు. విూకు అతడికి జీవిత కారాగార శిక్ష విధించాలని ఉంటే విధించండి. కుమార్ తలరాత నిర్ణయించాల్సింది న్యాయస్థానం. మా విద్యార్థి సంస్కృతిని తాలిబన్ సంస్కృతిగా మార్చకండి’ అని నర్వాల్ అనే ఏబీవీపీ విద్యార్ధి నాయకుడు అన్నారు. జేఎన్‌యూలో కన్హయ్య కుమార్ అరెస్టు వివాదం, రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు, పోలీసుల స్పందన తమను కలిచి వేసిందంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)కు చెందిన ముగ్గురు విద్యార్థి నాయకులు రాజీనామా చేశారు.వారు ఒక లేఖను ఈ సందర్భంగా విడుదల చేసినట్లు పేర్కొంది. విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చూస్తూ కూడా ప్రభుత్వానికి మద్దతుగా ఉండలేమంటూ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అధ్యక్షుడు రాహుల్ యాదవ్, కార్యదర్శి అంకిత్ హన్స్, మరో కార్యదర్శి ప్రదీప్ నావల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యార్థుల మధ్య చీలికలు తెచ్చేలా ఉన్నాయని వారు పేర్కొన్నారు. దీంతోపాటు దేశానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేయడాన్ని తాము కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అయితే, తమకు ఇప్పటి వరకు ఎలాంటి రాజీనామా లేఖలు అందలేదని ఏబీవీటీ ఉన్నత శ్రేణి నేతలు అన్నారు.