ప్రతిభ కనబరిచిన దొంతి విద్యార్థులు

శివ్వంపేట ఆగస్ట్ 19, జనంసాక్షి : భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మండల పరిధిలోని దొంతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  విద్యార్థులకు శుక్రవారం పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాలలో చిత్రలేఖనం అలాగే రంగోలి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు వారి మేధస్సుకు పదును పెట్టి, చూపరులను కూడా ఆకట్టుకునే విధంగా వారి చిత్రలేఖనం యొక్క ప్రతిభ కనబరిచారు. ఇందులో భాగంగా జాతీయ జెండాను ఎగరవేసే చిత్రం, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేవుడి ఫోటో ఇలా మరెన్నో చిత్రాలను గీసివారి చతురతను ప్రదర్శించారు. విద్యార్థుల ప్రతిభపై ఉపాధ్యాయులతో పాటు గ్రామస్తులు ప్రశంసించారు.