ప్రతిష్టాత్మకంగా హరితహారం: మంత్రి జోగు

ఆదిలాబాద్‌,మే30(జ‌నం సాక్షి):తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న 
పిలుపునిచ్చారు. నాలుగో విడతను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నామని అన్నారు. జూన్‌లో తొలకరి పలకరించగానే కార్యక్రమం చేపడతామని బుధవారం రాడిక్కడ అన్నారు.  అధికారులు, ప్రజాప్రతినిధులు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ఉత్సాహంగా మొక్కలు నాటే కార్యక్రమం సాగాలన్నారు. గతంలో చేపట్టిన మాదిరిగానే ఈ సారి కూడా అనుకున్న సమయానికి సమర్ధవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాల్లోని అంతర్గత రహదారుల్లో గతంలో వేసిన మొక్కల పరిస్థితి ఎలా ఉంది. వాటి సంరక్షణ బాధ్యత ఎవరైనా తీసుకుంటున్నారా..? లేదా..? అనే అంశాలను అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిలో ఉంచుకుని వాటికి అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. నీరు అందక చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను ఏర్పాటు చేయించాలని, అంతేకాకుండా మొక్కలకు రక్షణగా ఏర్పాటు చేసిన ట్రీగార్డులను తొలగించి కొత్తగా నాటే మొక్కలకు ఏర్పాటు చేయించాలన్నారు. హరితహారం కార్యక్రమాన్ని అటవీశాఖ యజ్ఞంలా చేపడుతుందని, ఇప్పటికే  అనేక  మండలాల్లోని నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలను అనుకూలమైన ప్రదేశాల్లో నాటడంతో పాటు వాటిని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ఇప్పటికే నాటించడం జరిగిందని అన్నారు.పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో హరితహారంలో విద్యార్థులను భాగస్వాములు చేయాలని మంత్రి  కోరారు.

తాజావార్తలు