ప్రతి ఒక్కరూ కుల మతాల కతీతంగా సేవాభావంతో కలిసిమెలిసి ఉండాలి
మక్తల్ పట్టణానికి చెందిన రషీద్ పరమత సహనానికి నిదర్శనంగా నిలిచి తన గొప్ప మనసును చాటుకున్నాడు. గురువారం రోజు మక్తల్ అయ్యప్ప స్వామి ఆలయంలో దాదాపు 100 మందికి పైగా అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి చెందిన స్వాములు రషీద్ ను శాలువాతో సత్కరించారు. గతంలోనూ అనేకసార్లు హిందూ పండగల సమయంలో అన్న ప్రసాదాలు, ఇతర సేవా కార్యక్రమాలతో రషీద్ తన గొప్ప మనసులు చాటుకున్నారు. ప్రతి ఒక్కరూ కుల మతాల కతీతంగా సేవాభావంతో కలిసిమెలిసి ఉండాలని ఇదే భారతదేశం యొక్క గొప్పతనానికి నిదర్శనమని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు అశోక్ గౌడ్, అనిల్ అయ్యా, శివరాం, శ్రీధర్ గౌడ్, పవన్ గౌడ్, రంజిత్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి ,విజయ్ గౌడ్ ,శివశంకర్ ఇతర స్వాములు తదితరులు పాల్గొన్నారు.