ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి

– 6 లక్షల వ్యయంతో నూతన అంగన్వాడి భవన ప్రహరి గోడ ప్రారంభోత్సవం
– ఎమ్మెల్యే నిధుల నుండి  5 లక్షల సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన
– ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

ప్రతి ఒక్కరూ  క్రీడలలో  రాణించాలని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.  మంగళవారం మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని ఆయన అన్నారు. రేపటి తరానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ  క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడాకారులకు కళాకారులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. అలాగే క్రీడలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం గ్రామంలో 6 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్వాడి ప్రహరీ గోడను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. అదేవిధంగా ఎమ్మెల్యే నిధులనుండి నాలుగు లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బిందు నరేందర్ రెడ్డి, మునగాల పిఎసిఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తొగరు రమేష్, టిఆర్ఎస్ నాయకులు బుర్ర పుల్లారెడ్డి, కాటమరెడ్డి ప్రసాద్ రెడ్డి, వేమూరి సత్యనారాయణ, ఎలక వెంకట్ రెడ్డి, తుమ్మలపల్లి భాస్కర్, నాయకులు పిల్లుట్ల శీను, ముత్తవరపు రమేష్, సర్పంచ్ కారింగుల నాగమణి సైదులు, గ్రామశాఖ అధ్యక్షులు బొమ్మ చిన్నవెంకన్న, టిఆర్ఎస్ నాయకులు నాగిరెడ్డి, వీరు, గ్రామ పాలకవర్గం, కబడ్డీ అభిమానులు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.