*ప్రతి ఒక్కరూ తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి

జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి,

వనపర్తి లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

జిల్లా ప్రజలందరికీ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ.

జిల్లా ఎస్పీ ముఖ్య కార్యాలయం నందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ.

వనపర్తి బ్యూరో సెప్టెంబర్17 (జనం సాక్షి)

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం వనపర్తి జిల్లా పోలీస్ ముఖ్య కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు.ఆదివారం నాడు జిల్లా పోలీసు ముఖ్య అధికారి రక్షిత కె మూర్తి, ముఖ్య కార్యాలయం నందు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటగా తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్,సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రాలకు పూల మాలలు అలంకరించి సాయుధ బలగాల గౌరవ వందనాల మధ్యన జాతీయ పతాకాన్ని జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి, ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ హైదరాబాద్ రాష్ట్రం 1948 సెప్టెంబర్ 17 వ తారీఖున భారతదేశ యూనియన్ నందు విలీనమై 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రం జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ప్రజలకు, విద్యార్థులకు ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ గురించి, రాష్ట్ర అవతరణకు ఎందరో మంది మహానుభావుల ప్రాణ త్యాగాల, జాతీయ సమైక్యతా దినోత్సవం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి తాజుద్దీన్ , డిస్పీ అనంద రెడ్డి , రిజర్వు ఇన్స్పెక్టర్లు శ్రీనివాసులు, అప్పలనాయుడు, ఎస్బి ఇన్స్పెక్టర్ మధుసూదన్ , డిసిఆర్బి, ఎన్ఐబి, ఐటీ కోర్, ఫింగర్ ప్రింట్స్, యస్ఐ లు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.