ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి డాక్టర్ షేక్ రసూల్
కొండమల్లేపల్లి అక్టోబర్ 18 జనం సాక్షి : ప్రతి ఒక్కరూ శుభ్రత గా ఉంటే వ్యాధులు దరి చేరవని, వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత కూడా ముఖ్యమని డాక్టర్ షేక్ రసూల్ విద్యార్థులకు సూచించారు మంగళవారం మండలంలోని రమావత్ తండాలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం శుభ్రత పై అవగాహన కల్పించారు నిత్యం పోషకాహారం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు ఈ కార్యక్రమంలో పి హెచ్ సి సిబ్బంది యాదగిరి, శ్రీలత, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పత్యా నాయక్, నరసింహ తదితరులు పాల్గొన్నారు
Attachments area