ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదగాలి

 

జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ సరిత

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 11 ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదువుకొని భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదగాలని జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత విద్యార్థులకు సూచించారు. గురుకుల పాఠశాలల కార్యదర్శి రోనాల్డ్ రోస్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో ఆదివారం స్వచ్ఛత గురుకుల్ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత అలంపూర్ వలయాధికారి సూర్యనాయక్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల విద్యార్థులు నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వారిని అలరింపజేశారు. అనంతరం జడ్పీ చైర్మన్ సరిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసి విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంత్ రెడ్డి, ఇటిక్యాల ఎస్సై గోకారి, ఎంపిటిసి యుగంధర్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ తిరుపతయ్య, పాఠశాల మరియు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.