ప్రతీకార చర్యలను కొనసాగించాల్సిందే

సర్జికల్‌ దాడులు జరిగి రెండేళ్లయిన తరవాత కూడా పాక్‌లో మార్పు రాలేదు. ఇమ్రాన్‌ పాక్‌ ప్రధానిగా బాధ్యతుల చేపట్టినా మార్పు రాలేదు. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ సైనికులను ఊచకోత కోస్తూనే ఉంది. అక్కడ సైన్యం ఉగ్రమూకలను పెంచి పోషిస్తూ భారత్‌పై ఎగదోస్తూనే ఉంది. ఇటీవల ఓ సైనికుడిని చిత్రహింసలకు గురి చేసి దారుణంగా తలనరికింది. దీనికి ప్రతీకారం తీర్చుకున్నామని ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. అదేంటన్నది మాత్రం చెప్పలేదు. నిజానికి దేశ విభజన తరవాత ఇప్పటి వరకు పాక్‌తో జరిగిన ఘటనలు చూస్తే పార్‌ బుద్దిలో ఏనాడు మార్పు రాలేదు. అక్కడి పాకుల్లో మార్పు కనిపించలేదు. రెండేళ్ల క్రితం భారత ప్రజలు సగర్వంగా తలెత్తుకుని జై జవాన్‌ అంటూ కీర్తించేలా సర్జికల్‌ దాడులతో ఉగ్రమూకల శిబిరాలను ధ్వసం చేశారు. జోహార్‌ అమర సైనికులకు అన్న నినాదాలు వారి ఆత్మకు శాంతి చేకూర్చింది. ప్రాణాలు తీస్తే ప్రాణాలు తీయడానికి వెనకాడమని పాక్‌కు గ్టటిగా బుద్ది చెప్పినందుకు పాక్‌ అడపాదడపా దాడుకలు తెగిస్తూనే ఉంది. ఇలాంటి దాడులత తరహాలోనే డోక్లా వద్ద భారత్‌ సైనికులు గట్టిగానే నిలబడ్డారు. ఈ తరహా ప్రతిఘటనలతో పాక్‌కే కాకుండా కవ్వింపుచర్యలకు పాల్పడుతున్న చైనాకు కూడ హెచ్చరికగా భావించాలి. పాక్‌ను వెనకేసుకుని రావడం వల్ల అంతర్జాతీయంగా ఉగ్రవాదానికి చైనా కూడా మద్దతు ఇస్తూనే ఉంది. అయితే దొంగదెబ్బతీస్తే అంతకు అంత సమాధానం ఇస్తామని సైన్యం నిరూపించింది. ఇంతకాలం ప్రతీకార చర్యలకు సిద్దంగా ఉన్నా గత పాలకుల నిర్ణయం కారణంగా మనవారు తెగింపు చేయలేకపోయారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో పరిమిత దాడులతో రగిలి పోతున్న భారతీయుల గుండెలను సైన్యం ఓదార్చినట్లయ్యింది. నిజానికి ఈ పని ఓ దశాబ్దం కిందనే చేసివుంటే భారత్‌పై ఉగ్రమూకల దాడులకు అవకాశం లేకుండా పోయేది. ఇంతకాలం మన సైనికులుల, ప్రజలు ఇంతగా ప్రాణాలు ఒడ్డాల్సి వచ్చేది కాదు. కుక్కకాటుకు చెప్పు దెబ్బ అన్నరీతిలో ఎప్పటికప్పుడు సమాధానం ఇచ్చే పరిస్తితిని గత పాలకులు విస్మరించారు. బంగ్లా విముక్తి, అంతకు ముందు యుద్దాల్లో పాక్‌ ఓడినా మనవాల్లు నిగ్రహంగ ఉండం వల్లనే ఇంతకాలం పాక్‌ పెట్రేగుతూ వస్తోంది. నియంత్రణ రేఖ అవతల మన కాశ్మీర్‌లో ఉగ్రమూకలను పెంచి పోషిస్తూ రెచ్చగొడుతోంది. రెండేళ్ల క్రితం యూరీ దాడికి మన దళాలు ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకున్నాయి. భారత సైనికుల దెబ్బను రుచి చూపించాయి. వెన్నుపోటు పొడుస్తున్న వారికి తొలిసారిగా వెన్నులో వణుకు పుట్టించాయి. మంచి మాటలు తలకెక్కించుకోని ముష్కరులకు దండోపాయం ఎలా ఉంటుందో తెలియ చెప్పాయి. ఇప్పుడు ఉగ్రవాదులను తుదముట్టిం చడం ద్వారా ఇంతకాలం మా దగ్గర అలాంటి వారు లేరంటున్న పాక్‌ పాపాల భైరవులు ప్రపంచానికి సమాధానం చెప్పుకోవాలి. ఉగ్రదాడులు జరిగిన ప్రతి సందర్భంలో మా ప్రమేయం లేదంటున్న వారు పివోకెలో ఉగ్ర శిబిరాలు ఎందుకునడుస్తున్నాయో చెప్పాలి. నిజానికి పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ను మన ఆధీనం లోకి తెచ్చుకోవడంలో గత పాలకుల నిర్లక్ష్యంకారణంగానే ఇంతకాలంగా మనం ఉగ్రదాడులకు బలి కావాల్సి వస్తోంది. ఉగ్రమూకలపై చెలరేగిపోవడం ద్వారా చేసిన సైనిక చర్యతో పాక్‌ కళ్లు తెరవాలి. ఉగ్రవాద దాడులతో ఎంత నెత్తురోడుతున్నా సంయమనం పాటిస్తూ వచ్చిన తీరును మన దౌర్బల్యంగా గుర్తించి నిత్యం ఉగ్రమూకలను ఎగదోస్తూనే ఉంది. ఈ సందర్బంగా మనం వ్యూహాన్ని మార్చుకోవాలి. పాక్‌ భవిష్యత్‌లో మళ్లీ కన్నెత్తి చూడాకుండా చేయాలి. అంతర్జాతీయ కట్టుబాట్ల పేరుతో నోరు మెదపకుండా కూర్చొనే రోజులు పోయాని గుర్తు చేయాలి. పాకిస్థాన్‌కు భారత్‌ గట్టిగా బుద్ధి చెప్పి ప్రజల్లో ఆత్మస్థయి ర్యాన్ని నింపాలి. అలాగే సైన్యానికి స్వేచ్ఛను ఇవ్వాలి. అయితే కొందరిని మట్టుపెట్టినంత మాత్రాన

ఉగ్రభూతం సమసిపోయిందనుకుంటే పొరపాటే. పాక్‌ సరిహద్దుల వెంట అనేకమంది ఉగ్రమూకులు ఇంకా శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అనేక శిబిరాలు శిక్షణను ఇస్తున్నాయి. అలాఉన్న శిబిరాలను కూల్చాలి. వారిని తుదముట్టించాలి. సైన్యంలో ఎగసిన ప్రతీకార జ్వాలను తన దాడితో ధ్వంసం చేయాలి. తమ భర్తల బలిదానానికి ఓదార్పు, పరిహారం అక్కర్లేదని, ప్రతీకారం కావాలన్న మృతుల వీరపత్నులకు ఓదార్పును ఇచ్చేలా సైనిక చర్య ఉండాలి. భారత్‌లోకి చొచ్చుకురావడానికి సిద్ధమవుతున్న ఉగ్రవాద ముఠాలు నిరంతరంగా ప్రయత్సిస్తూనే ఉన్నాయి. పక్కా ప్రణాళిక, నిఘా సమాచారంతో ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఏడు ఉగ్రవాద చొరబాటు శిబిరాలపై విరుచుకు పడ్డట్లుగానే మిగతా శిబిరాలపైనా వరుస దాడులు కొనసాగించాలి. వేలల్లో ఉన్న ఉగ్రమూకలను మట్టుపెడితే తప్ప మన రక్త తర్పణానికి అర్థం ఉండదు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ సహా అన్ని రాజకీయ పార్టీలూ తమ విభేదాలను పక్కనపెట్టి, ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి. పాక్‌కు బుద్ధి చెప్పాల్సిందేనని భారత్‌ ముక్త కంఠంతో డిమాండ్‌ చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా.. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులకు గుణపాఠం తప్పదని స్పష్టం చేస్తూ వచ్చారు. ఉగ్రమూకలకు గ్టటి సమాధానం చెప్పేలా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌పై మిలిటరీ దాడులు జరగాలి. పివోకెను ఆక్రమించుకునే ప్రయత్నం చేసి కాశ్మీర్‌ను నిలబెట్టాలి. అప్పుడే పాక్‌ను దారిలోకి తీసుకుని రాగలం.