ప్రత్యేక తెలంగాణ సాధించడం కొరకే ప్రజాపోరు యాత్ర-నారాయణ
ఖమ్మం:సీపీఐ చేపట్టిన తెలంగాణ ప్రజాపోరు యాత్ర రెండో రోజు ఉదయం ఖమ్మం జిల్లా ముదిగొండ నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రకు సీపీఐ కార్యకర్తలు, తెలంగాణ వాదులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక తెలంగాణ సాధించడం కొరకే సీపీఐ ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు సీపీఐ కార్యదర్శి నారాయణ తెలిపారు. తెలంగాణ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.