ప్రథమ సంవత్సరం కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కళాశాలకు ప్రవేశం

ఫోటో  :విలేఖరులతో మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ గుంజ ప్రమీల

పెన్ పహడ్.  జూలై   (జనం సాక్షి) : మండల పరిధిలోని అనాజిపురం ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ కొరకు ఆన్లైన్లో అప్లై చేసుకున్న,విద్యార్థుల సెలక్షన్ లిస్టును కళశాల నోటీసు బోర్డుపై ప్రదర్శించడం జరిగిందని ప్రిన్సిపల్ గుంజా ప్రమీల మంగళవారం ఓ ప్రకటనలో  తెలిపారు ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ  సీటు వచ్చిన విద్యార్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని  తేది : 23-07-2022 (శనివారం) లోపు కళాశాల కార్యాలయంలో సంప్రదిచగలని లేని యెడల వారి యొక్క సీటును వెయిటింగ్ లిస్టులో ఉన్న విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు..