ప్రదోన్నతుల్లో రిజర్వేషన్ల బిల్లును స్వాగతించిన టీడీపీ

హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లు ఆగస్టు 22న పార్లమెంట్‌లో పెట్టాలనే నిర్ణయాన్ని తేదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్వాగతించారు. అయితే బీసీలు కూడా పదోన్నతుల్లో రిజర్వేషన్లు పొందేలా ఈ బిల్లులో వెనకబడిన వర్గాలను చేర్చాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌ ఏళ్ల తరబడి అమలుకు నోచుకోకపోవటం శోచనీయమన్నారు. నేషనల్‌ ఫ్రంట్‌ చైర్మన్‌గా ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు కేంద్రంలో మండల కమీషన్‌ సిఫార్సుల ఆమోదం వల్ల కేంద్ర సర్వీసుల్లో ఐపీఎస్‌, ఐఏఎస్‌ నియామాకాల్లో కొంతమేర బీసీలకు న్యాయం జరిగిందని గుర్తుచేశారు. అయితే పదోన్నతుల్లో రిజర్వేషన్లు లేనందువల్ల చాలామంది ఉన్నత ఉద్యోగాలు కోల్పోతున్నారని, కాబాట్టి వారికి జరగుతున్న అన్యాయాన్ని పరిగలోకి తీసుకుని ఆగస్ట్‌ 22న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే రాజ్యాంగా సవరణ బిల్లులో బీసీలను కూడా పొందుపర్చాలని డిమాండ్‌ చేశారు.