ప్రధానికి గౌరవ…
లూథియానా: ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు పంజాబ్ విశ్వవిద్యాలయం(పీఏయు) గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. భారతదేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ఆయనను పీఏయూ అభివర్ణించింది. పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యా లయం స్వర్ణోత్సవాల్లో భాగంగా శనివారం నాడిక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానికి ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఆయనతో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) మాజీ డైరెక్టర్ జనరల్ ఆర్ ఎన్ పరోడా, ప్రఖ్యత శాస్త్రవేత్త జస్వంత్‌సింగ్ కన్వర్‌లకు కూడా గౌరవడాక్టరేట్‌లను ప్రధానం చేశారు. అత్యంత ప్రతిభావంతుడైన ఆర్థికవేత్తగా, మేధోసంపన్నడుగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డాక్టర్ మన్మోహన్ సింగ్ పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి 1952లో ఆర్థిక శాస్త్రంలో ఆన్సర్ డిగ్రీని, 1954లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం కేంబ్రిడ్జిలో ఉన్నతవిద్యాభ్యాసం చేశారు. అన్నింటా ప్రధముడిగా నిలిచిన
ఆయన 1956లో ప్రతిష్టాత్మక ఆడమ్‌స్మిత్ బహుమతిని పొందారు. భారత ఆర్థికమంత్రిగా ఆయన సారధ్యంలో చోటు చేసుకున్న పరిమాణాలు దేవ ఆర్థిక వ్యవస్థను మేలిమలుపు తిప్పాయని పీఏయూ శ్లాఘించింది.