ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
– నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు
మెదక్,ఆగస్టు 5(జనంసాక్షి): మొట్టమొదటి సారి ప్రధాని ¬దాలో నరేంద్రమోడీ తొలిసారిగా తెలంగాణకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిని బిజెపి, టిఆర్‌ఎస్ రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎవరి ఏర్పాట్లలో వారున్నారు. ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రధాని పర్యటన వివరాలను తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాని ¬దాలో నరేంద్రమోడీ తొలిసారిగా ఈ నెల 7న రాష్ట్రానికి వస్తున్నారని, ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ముఖ్యంగా మోడీ రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందని, అందుకోసం ప్రధానికి అత్యంత ఘనంగా స్వాగతం పలుకుతామని వివరించారు. మరోవైపు మిషన్ భగీరథను ప్రధాని చేతులవిూదుగా ప్రారంభం చేసుకోవడం శుభసూచకమని చెప్పారు. ఈ పర్యటనలో మోదీ దాదాపు 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఎర్లాలంట్‌ను జాతికి అంకితం చేస్తారని ఈ సందర్భంగా హరీష్‌రావు పేర్కొన్నారు. అలాగే రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని ప్రధాని, సీఎం కేసీఆర్ పునఃప్రారంభం చేస్తారని, కొత్తపల్లి – మనోహరబాద్ రైల్వేలైన్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారని హరీశ్‌రావు వివరించారు. ఇప్పటికే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మిషన్ భగీరథ పైలాన్ నిర్మాణం కూడా పూర్తయిందని చెప్పారు. అలాగే పర్యటనలో మొత్తం మూడు వేదికలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు ఇప్పటికే సమావేశమై అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. మఖ్యమైన ప్రధాని వేదిక విూద 18 మంది అతిథులు కూర్చునేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అలాగే 2 లక్షల మంది దాగా వీక్షకులు కూర్చునే విధంగా బహిరంగ సభకు ఏర్పాట్లు జరిగాయని చెప్పారు. ప్రధాని పర్యటనలో మొత్తం నాలుగు హెలిప్యాడ్‌లు సిద్ధం చేశామని వివరించారు. అలాగే 170 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు ఉంటాయని, ఎవరికీ ఇబ్బందులు లేకుండా చేసుకుంటున్నట్లు చెప్పారు. బహిరంగ సభ ప్రాంగంణలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి, భద్రత వ్యవస్థనపు పటిష్టం చేశామన్నారు. దేశ ప్రధాని సభను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని, ఎప్పటికప్పుడు వారు చర్యలు తీసుకుంటున్నారని మంత్రి కొనియాడారు. ప్రధాని పర్యటను విజయవంతంగా పూర్తిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు.