ప్రధాని మోదీ తెలంగాణలో తొలి అడుగు

5
ప్రతిష్టాత్మక మిషన్‌ భగీరథ ప్రారంభం

ఎన్టీపీసీ ప్లాంటు, ఎరువుల కార్మాగారానికి శంకుస్థాపన

హైదరాబాద్‌,ఆగస్టు 6(జనంసాక్షి):2014లో పార్లమెం ట్‌ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్‌ వచ్చిన అప్పటి గుజరాత్‌ సీఎం నరేంద్రమోడీ.. ఇప్పుడు ప్రధాని ¬దాలో మొదటిసారిగా రాష్ట్రానికి వస్తున్నారు.   7న మెదక్‌ జిల్లా గజ్వెల్‌లో మిషన్‌ భగీరథను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత కరీంనగర్‌ జిల్లా రామగుండం ఎన్టీపీసీ ప్లాంటు, ఎ రువుల కర్మాగారానికి శంకుస్థాపన చేస్తారు. వరంగల్‌ లో టెక్స్‌ టైల్‌ పార్కుకు కూడా ఫౌండేషన్‌ స్టోన్‌ వేస్తారు. ఇటీ వల ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్‌ ? రాష్ట్రానికి  రావాలని ప్రధానిని ఆహ్వానించడంతో  ఆయన సానుకూలంగా స్పం దిచారు. దీంతో వెంటనే టూర్‌ ఖరారయింది. దీనికి సం బంధించి పీఎంఓ నుంచి  సీఎం కార్యాలయాలనికి సమా చారం అందింది. ప్రభుత్వ ప్రోగ్రామ్స్‌తో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ  మోడీ పాల్గొంటున్నారు బీజేపీ నేతలు. ప్రతి పోలింగ్‌ బూత్‌ నుంచి.. ఓ మహిళతో కలిపి ఆరు గురు కార్యకర్తలతో  మహా సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నా రు.  రాష్ట్రానికి  కేంద్రం అందిస్తున్న సహాయాన్ని ప్రధాని ప్రజలకు వివస్తారని చెబుతున్నారు.  మిషన్‌ భగీరథ ప్రారంభానికి మోడీ రావడం వల్ల పార్టీకి రాజకీయంగా ఇబ్బంది వస్తుందని  కొందరు నేతలు అనడంతో ?  ప్ర ధాని ¬దాలో పాల్గొంటే వచ్చే నష్టం లేదని సీనియర్లు  సర్ది చెప్పినట్టు తెలుస్తోంది. ప్రధాని ¬దాలో కొత్తగా ఏర్ప డ్డ తెలంగాణలో ఆయన అడుగు పెడుతున్నారు. ఎపిలో అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోడీ ఇప్పటి వరకు తెలంగాణకు రాలేకపోయారు. సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ  ప్రాజెక్టుకు  ఆది వారం ప్రధానమంత్రి మోడీ చేతుల విూదుగా ప్రారంభం కాబోతోంది. మెదక్‌ జిల్లా కోమటిబండలో పైలాన్‌ ఆవిష్క రణతో మిషన్‌ భగీరథకు తొలి అడుగుపడబోతోంది. మిష న్‌ భగీరథ తొలిదశలో భాగంగా సీఎం సొంత నియో జకవర్గం గజ్వేల్‌ లోని 243 గ్రామాల్లోని 66,000 ఇళ్లకు పైప్‌ లైన్ల ద్వారా సురక్షిత మంచినీటిని ఇవ్వనున్నా రు. 2014 ఎన్నికల్లో ఎక్కడ ప్రచారం చేసినా.. ఆయన నో టినుంచి వచ్చిన వాగ్దానాల్లో ఇదొకటి. రాష్ట్రంలో ప్రతి ఇం టికి పైప్‌ లైన్‌ ద్వారా మంచి నీళ్లు అందించని పక్షంలో మ రోసారి ఓట్లడగనని.. ప్రతిజ్ఞ చేసి మరీ గెలిచారు. ఆ వాగా ్దనం నిలబెట్టుకునే క్రమంలో మొదటి అడుగు సొంత జిల్లా మెదక్‌ లోనే వేస్తున్నారు. సురక్షిత మంచినీటి సరఫరా ఇప్ప టికే ఉన్నా, సీఎం చేస్తున్న పని దానికి కాస్త తేడా ఉంది. ఇంతకు ముందు ప్రభుత్వాలురాష్ట్రంలో చాలా గ్రామాలకు సురక్షిత మంచినీరు అందించాయి. అయితే ఎండాకాలంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేవి. మళ్లీ చాలా మంది బోరు నీళ్లపైనే ఆధారపడాల్సి వచ్చేది. అలా రక్షిత మంచినీరు విషయంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందేవి. దాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్‌ ఈ పథకానికి రూపకల్పన చేశారు. సిద్ధిపేట నియోజకవర్గ ప్రజలకు వాటర్‌ గ్రిడ్‌ పథకం ద్వారా మంచినీటిని అందించారు. దాన్నే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. నిరంతరం రక్షిత మంచినీరు అందించేందుకు 43వేల కోట్ల రూపాయలతో భారీ ప్రణాళిక రచించారు. మొదట 35 వేల కోట్లు అనుకున్నా.. తర్వాత అంచనాలు పెరిగాయి. 25 వేల గ్రామాలు, 67 పట్టణ ప్రాంతాలు ఈ మిషన్‌ భగీరథ ద్వారా లబ్దిపొందనున్నాయి. శ్రీశైలం, శ్రీరామ్‌ సాగర్‌, కొమురం భీం ప్రాజెక్టు, పాలేరు ప్రాజెక్టు, జూరాల, నిజాం సాగర్‌ ప్రాజెక్టులతో నీటిని అందించేందుకు ప్రణాళికలు రచించారు. పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌ మెంట్‌, రూరల్‌ వాటర్‌ సప్లై డిపార్ట్‌ మెంట్‌ లు ప్రాజెక్టులకు రూపకల్పన చేశాయి. ఈ పథకంలో అందరికంటే ముందుగా సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌ ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. ప్రస్తుతం ఉన్న నీటి ప్రాజెక్టుల నుంచి నీటిని ఆయా గ్రామాలకు తరలిస్తారు. దీంతో ఎండాకాలంలోనూ నిరంతరంగా నీటి సరఫరా సాగుతుంది.