ప్రధాని విందు దౌత్యం

 

ఎఫ్‌డీఐలను వ్యతిరేకించిన డీఎంకే, బీఎస్పీలకు మన్మోహన్‌ గాలం
పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో భాగస్వామ్య పార్టీలతో భేట
న్యూఢిల్లీ,నవంబర్‌11(జనంసాక్షి):
దేశీయ చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తామని యూపీఏ కీలక భాగస్వామ్య పక్షమైన డీఎంకే ప్రకటించింది. దీంతో యూపీఏ బయట నుంచి మద్దతిస్తున్న ఎస్పీ, బీఎస్పీలకు గాలం వేసే పనిలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే యూపీఏ భాగస్వామ్య పార్టీలకు ఆదివారం విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ బీఎస్‌పీ అధ్యక్షు రాలు మాయమతి, డీఎంకే నేత కరుణానిధిని విందుకు ఆహ్వానించారు. ఈ విందులో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ కూడా పాల్గొన్నారు. పార్లమెంటరీ శీతాకాల సమావేశాలు ఈ నెల 22నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ రాజకీయల పార్టీల నాయకులతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమావేశమవుతు న్నారు. ఎప్‌డీఐలకు వ్యతిరేఖంగా అవిశ్వాసం ప్రవేశపెడతామని తృణమూల్‌ కాంగ్రెస్‌ వైఖరిపై తన అభిప్రాయాన్ని వెల్లడించేందుకు మాయావతి సుముఖత చూపలేదు. పార్లమెంటులో బీఎస్పీకి 21 మంది సభ్యుల బలముంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత మూలాయాం సింగ్‌ యాదవ్‌తో శనివారం రాత్రి ప్రధాని సమావేశమైన సంగతి తెలిసిందే. పార్లమెంటులో ఎస్పీకి 22 మంది సభ్యులున్నారు. లోక్‌సభలో 19 మంది సభ్యుల బలమున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ యూపీఏ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెలుపల నుంచి మద్దతు ఇచ్చే పక్షాలతో ప్రధాని సంప్రదింపులు జరుపుతున్నారు. అవిశ్వాస తీర్మాణాన్ని ఎదుర్కోవాల్సిన పక్షంలో మూలాయాం సింగ్‌ యాదవ్‌ మద్దతు ఇస్తారన్న విశ్వాసంలో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. వామపక్షాలతో సహా పలు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమై ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ప్రధాని కోరనున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో భాగంగా ప్రధానితో తన బేటీ ప్రాధాన్యతను తగ్గించేందుకు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఢిల్లీలో ప్రయత్నించారు. మద్దతు గురించి ప్రశ్నించగా ఆమె తప్పించుకునే విధంగా బదులిచ్చారు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పారు. ఇంత ముందుగా మీరెందుకు ప్రశ్నిస్తారన్నారు.