ప్రధాని సభకు బయలుదేరిన బిజెపి నాయకులు
శంకరపట్నం: జనం సాక్షి నవంబర్ 12
ప్రధాని మోదీ బహిరంగ సభకు శంకరపట్నం మండలం బిజెపి పార్టీ మండల శాఖ అధ్యక్షుడు చల్ల ఐలయ్య ఆధ్వర్యంలో భారీగా పార్టీ శ్రేణులు వాహనాలు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా రామగుండం లో ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించి, ప్రాజెక్టులను భారతదేశ ప్రధాని నరేంద్ర మోది ముఖ్య అతిథిగా జాతికి అంకితం అంకితం చేసి అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారని, ప్రధానమంత్రి మోది బహిరంగ సభకు శంకరపట్నం మండల పరిధిలోని 24 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల నుంచి బిజెపి పార్టీ నాయకులు అభిమానులు వాహనాల్లో భారీగా తరలి వెళ్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు ఏనుగుల అనిల్, అంతం లతా రాజిరెడ్డి, బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకటరెడ్డి, నాయకులు సమ్మిరెడ్డి, కొమురయ్య నరేందర్, సాగర్, జైపాల్, రాజిరెడ్డి ,శ్రీనివాసరెడ్డి ,సదాశివరెడ్డి, శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, పార్టీ అనుబంధ సంఘాల, నాయకులు బాధ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు