ప్రపంచీకరణలో ఛిద్రమయిన వల్లే బతుకులు

గ్రామీణ ప్రాంతాలలో నివసించే శ్రమజీవులపై ఆర్థిక సంస్కరణ ప్రభావం పడడంతో వ్యవసాయ రంగాన్ని సరళిక రించారు. దీంతో కార్పొరేట్‌ వైపు వ్యవసాయం పరిగేడుతుంది. రైతులు కూలీలుగా మారుతున్నారు. నాగరిక సమాజం ఆవిర్భవి ంచిన్పటికి నుంచి కూలీ అంటే బానిసగానే బ్రతుకుతున్నారు. భారతదేశంలో నూటికి 80శాతం మంది భూమిని నమ్ముకొని బ్రతుకుతున్నారు. అర్థభూస్వామ్య వ్యవస్థలో భూస్వామ్యలతో పా టు మరికొన్ని చిన్నచిన్న గ్రామీణ వర్గాలు ఏర్పాడ్డాయి. రైతం గంలో వర్గీకరణ జరిగింది. ధనికరైతులు, మధ్య తరగతి రైతులు, పేద రైతులు చిన్న సన్నకారు రైతులు వ్యవసాయ కూలీలు, గ్రామీణ కార్మికవర్గాలుగా ఏర్పడినాయి. కూలీలు జీవనోపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. నేడు వ్యవసాయం పరిస్థితి సంక్షభంలో కొట్టుమిట్టాడుతున్నారు. మాయ ధారి యంత్రాల వల్ల రైతు కూలీల పని దినాలు తగ్గిపోయినాయి. నిరుద్యోగం, కరువు విలయతాండవిస్తున్నాయి. రైతు కూలీలు నేడు తక్కువగా ఉన్నారని తమ గణంకాలలో తప్పుడు లెక్కలు చూపుతు న్నాయి. 60శాతం గ్రామీణ ప్రాంత జనభాలో తమ రెక్కలు ముక్కలుగా చేసుకొని బ్రతుకు ఇడుస్తున్నారు. ప్రపంచీకరణ విధానా లు అమలులో భాగంగా అభివృద్ధి జపం చేస్తూ భారీ ప్రాజెక్టులు సెజ్‌లు కనిజవనరులు రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ జరిపి దేశ విదేశీ కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నారు. దీంతో గ్రామీణ రైతంగం బీకారులను చేసి రైతు కూలీలుగా నెట్టివేస్తుంది. కార్పొరేట్‌ కాంట్రాక్టు వ్యవసాయాన్ని దొడ్డి దారిన చాపకింద నీరుల పారుతుంది. పాలమూరు, మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల రైతు కూలీల దీనస్థితి యదార్థ చిత్రాలు మనం చూస్తునే ఉన్నాం. పెరిగిన నిత్యవసర వస్తువులు డీజీలు, పెట్రోల్‌ చార్జీల భారాలు గ్రామీణ ప్రజానికమంతా తల్లడిల్లుతున్నారు. పేదలకు గ్రామీణ కూలీలకు పనికి ఆహారపథకం వందరోజుల పని కల్పించడం , పనికి ఆహార పథకంలాంటి పథకాలతో యంత్రాలతో పనులు చేయిస్తున్నారు. దీంతో పేదరికం పెరిగింది. కొనుగోలు పడిపోయింది. బుణగ్రస్థు లు అవుతున్నారు. ఉపాధి హామి పథకం నోచుకోకపోవడంతో కాలే కడుపులను ఆకలిని తీర్చుకునేందుకు పొట్టచేత పట్టుకొని ఉపాధికై దేశం కాని దేశాలకు వలసలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌ ,అదిలాబాద్‌ తదితర జిల్లాల నుంచి ముంబాయి, చోలాపూర్‌ వంటి నగరాలకు వలసపోతు న్నారు. ఆదివాసులు గుజరాత్‌, సూరత్‌, ఆహ్మాదాబాద్‌, ఢిల్లీ వంటి నగరాలకు లక్షలాది మంది వలసలు పోతున్నారు. పిల్లలు, వృద్థులు వరంతా భవన నిర్మాణ కార్మికులుగా వెళ్తున్నారు. సురాత్‌ నగరంలో లక్షయాభైవేల మంది ఆదివాసులు హమాలీలుగా, తోపుడు బండి కార్మికులుగా, హమాలీలుగా వెట్టిచాకిరి పనులలో దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు. వీరికిచ్చే దినసరి వేతనం కేవలం 120 రూపాయలు మాత్రమే వీరిని కంపెనీ కార్మికులుగా లేదా రెగ్యూలర్‌ కార్మికులుగా వీరిని చేర్చుకోరు. ప్రతి సంవత్సరం పాలమూరు నుంచి చెంచులు, ఆదివాసులు గిరిజనులు సంవత్స రాఇనికి రెండు లక్షల మంది ప్రధానమయిన పట్టణాలు , నగరా లకు వలసలు పెరిగాయి. రొట్టె కారంతో కాలాన్ని గడుపుతున్నారు. దీంతో ప్రాణాంతకమైన వ్యాధుల భారిన పడి చనువు చాలిస్తు న్నారు. మహానగరాలలో పనిలేక 20 రోజులైన నిరుద్యోగంతో ఉంటున్నారు. పని ఉన్న రోజుల్లో తప్ప మిగిత రోజుల్లో సగం కడుపుతోనే బ్రతుకుతున్నారు. దేశంలో భూకంపాలు సంభవిం చినప్పుడు సుమారు 35వేల మంది ఆదివాసులను కూలీలుగా వాడుకుంటున్నాయి ప్రభుత్వాలు. వరస కరువులతో తెలంగాణ ప్రాంతం నుంచి 55శాతం మంది రైతులు వలసలు వెల్లిపోయారు. గల్ఫ్‌ దేశంలో మన రాష్ట్రం కరీంనగర్‌ జిల్లా వాసులే ఇప్పటి వరకు గడిచిన ఐదేళ్ళ కాలంలో 525మంది మృతి చెందారు. దినదినంగా మరణాల సంఖ్య పెరుగుతుంది. మరో 425మంది నకిలీ వీసాలతో పట్టుబడి కేంద్ర కారగార జీవితాలలో మగ్గుతున్నారు. దేశం కాని దేశంలో జైళ్ళలో మృతి చెందుతున్నారు. గల్ఫ్‌ దేశాల్లో మొత్తం 53లక్షల మంది భారతీయుల్లో కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన వారు 6లక్షల మంది ఉంటారు. దుబాయి, షార్జా, సౌది, రియాద్‌, ఆరేబియాలో బిద్దా, దమ్మత్‌తో పాటు మస్కట్‌, కువాయిట్‌, దుహకత్తర్‌ వంటి దేశాలలో అడ్డమైన వెట్టి చాకిరి పనులలో కాలాన్ని గడుపుతున్నారు. ఇప్పటికే అనావృష్టి, అతివృష్టి, వరుస కరువులు వచ్చిరాని విద్యుత్‌, నీరు లేకపోవడంతో ఇప్పటికే నిరాశతో రెండుకోట్ల మంది రైతులు దేశవ్యాప్తంగా వ్యవసాయం మానేసారు. ఆరగంటకొక రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. 1995నుంచి 2012వరకు దేశంలో 233342మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా మన రాష్ట్రంలో 34320మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వాలు మాత్రం కేవలం 5560మంది రైతుల ఆత్మహత్యలను గుర్తించింది. తెలంగాణ ప్రాంతంలో 1995 నుంచి 2012 వరకు సుమారు 8వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. 2004జూన్‌ 1న ప్రభుత్వం జారీ చేసిన జీవో 421రైతుల ఆత్మహత్యలకు వర్తిస్తుంది. జీవో పని చేయకపోవడంతో కుటుంబాలు సహాయం కోసం ఎదురు చూపులు, అర్థాకలితో అలుమటిస్తున్నారు. ఫించన్లు, రేషన్‌కార్డులు సంక్షేమ పథకాలు అందకపోవడంతో రైతుల పిల్లలను పాఠశాలలో చేర్పించడం ప్రభుత్వం విస్తరించింది. రైతుల ఆత్మహత్యల నివార ణకు ప్రభుత్వం నియమించిన జయంతిఘోష్‌ కమిషన్‌ సిఫార్సు లను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. నష్టపోయిన రైతుల పంటలకు పరిహారం అందించాలి. 421జీవో కౌలు రైతులకు వర్తించకపోవడంతో అనగారిన కూలాలకు తీరని అన్యాయం జరిగింది. ఇది ఇలా ఉంటే బండారి దత్తత్రేయ, నాగం జనార్థన్‌రెడ్డి లాంటి రాజకీయ నేతలు రైతుల ఆత్మహత్యలను తిన్నదరగకా ఆత్మహత్యలు చేసకుంటున్నారని కించపరిచారు. అధికారంలో ఉంటే ఒక తీరు, అధికారం లేకుంటే ఒక తీరు రైతులపై కపట ప్రేమను చూపిస్తున్నారు. ముఖ్యంగా రైతులు అనేక సమస్యలను ఎదుర్కోంటున్నారు. విత్తనాలు ఎరువులు పరుగుమం దులు పరపతి సాగునీటి సౌకర్యాలు వెంటాడుతు న్నాయి. వందరోజుల పని చూపడం ఒక్కో కూలీకి వందరోజలు పని కాకుండా కుటుంబానికి వందరోజులుగా మార్చారు. రోజు వారి కూలీ వంద రూపాయలు కాకుండా పీస్‌రేట్‌ అమలు చేస్తూ తక్కువ కూలీ చెల్లిస్తున్నారు. కూలీల జీవితాలు మరింత దయనీయంగా మారింది. కనీస దినసరి వేతనం నోచుకోకపోవడంతోనే పేదరికం పెరిగింది. ఇదిలా వుంటే గ్రామీణ ప్రాంతంలోఉపాధి పెరిగింది. దీంతో దారిద్రం తగ్గిందని ప్రభుత్వాలు కాకిలేక్కలు చూపుతు న్నాయి. నిరుద్యోగం దినదినంగా పెరుగుతుంది. దీన్ని మన పాలకు లు గుర్తించాలి. పల్లెలు మారు భూమిగా మారాయి. కుల వృత్తులు, చేతి వృత్తులు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగళి, బ్యాగరి, సంచరజీవులు వృత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పనుల కోసం పట్టణాలకు వెతుకుంటు వెళ్తున్నాయి. కూలీ కడుపులేవ్వరు కొట్టి బాల్యం నుంచి విద్యార్థి యువజనులు, బాల కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకొని వృద్దులు కష్టం చేస్తే కాని ప్రాణం నిలుపుకోలేరు. జానడు పొట్టను నింపుకోవడానికై పల్లె ప్రజల అవస్థలు అన్ని ఇన్ని కావు. అసంఘటిత రంగాలలో కూలీలతో పాటు మహిళల సంఖ్య పెరుగుతుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెరుగకపోవడంతో 60శాతం మంది మూడు పూటల తిండిని తినలేకపోతున్నారు. రాష్ట్రంలో లక్షమంది గర్భిణీ స్త్రీలు ఉంటే అందులో 140మంది చనిపోతున్నారని, వెయ్యి మంది శిశువుల్లో రోజుకు 60మంది శిశువులు మృతి చెందుతున్నారని, రోజుకు దేశ వ్యాప్తంగా పది మంది ఆకలితో అలమటించి చనిపోతున్నారు. ప్రపంచీకరణ సరళికరణలో పల్లె బతుకులు పూర్తిగా చిద్రమైనవి. వీరి బతుకుల్లో పాలకులు వెలుగులు నింపేనా!?