ప్రభుత్వం ప్రకటించిన పంట నష్టం
మొక్కజొన్నకేనా….ప్రభుత్వం ప్రకటించిన పంట నష్టం మొక్కజొన్నకేనా….వరి పొలాలకు పట్టించుకోరా… మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు సాహెబ్ హుస్సేన్
వీణవంక మార్చి 29 (జనం సాక్షి )వీణవంక మండలంలోని ఆయా గ్రామాల్లో ఇటీవల కురిసిన వడగళ్ల వానకు రైతులు భారీగా పంటలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిది. రైతులకు ఎకరాకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం తక్షణమే అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా రామడుగు సభలో ప్రకటించారని మండల వ్యవసాయ అధికారులు రైతులను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం మొక్కజొన్న పంటకు మాత్రమే కాకుండా వరి పంటకు కూడా నష్ట నివారణ చర్యలు చేపట్టి నష్టపోయిన వరి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ఆరుగాలం పండించిన పంట వడగళ్ల వానకు గాలితో నేలకు వాడడంతో మరి ధన్యం రాలి రైతు నష్టపోయే పరిస్థితి ఉందని వరి రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఆదేశాలను అనుసరించి మండల వ్యవసాయ అధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరారు.